టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) భేటీ అయ్యిన‌ట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌(Hyderabad)లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నవంబర్ 4న కూడా ఇరువురు నేత‌లు భేటీ అయ్యారు.

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) భేటీ అయ్యిన‌ట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌(Hyderabad)లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నవంబర్ 4న కూడా ఇరువురు నేత‌లు భేటీ అయ్యారు. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై ఆ భేటీలో చ‌ర్చించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో పొత్తు ప్రక్రియ వేగవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గతంలో ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మరోసారి చంద్రబాబు, పవన్ క‌ళ్యాణ్‌ భేటీ జరిగింది. ఇరువురు నేత‌ల వ‌రుస భేటీల‌తో ఏపీలో రాజ‌కీయాలు హాట్ టాఫిక్‌గా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కిచ్చుకోవాల‌ని ఇరు పార్టీల నేత‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

Updated On 6 Dec 2023 6:40 AM GMT
Ehatv

Ehatv

Next Story