పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పకనే చెప్పారు.. ఎవరైనా కలిసిరాకపోతే ఒప్పించి తీసుకొస్తానన్నారు. అన్ని ఆలోచించే 2014ల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చానని పవన్ తెలిపారు.. నా బలమేంటో నాకు తెలుసనీ.. ప్రజల ప్రయోజనాలకోసమే పొత్తులు ఉంటాయని జనసేనాని అన్నారు.

పొత్తులపై జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పకనే చెప్పారు.. ఎవరైనా కలిసిరాకపోతే ఒప్పించి తీసుకొస్తానన్నారు. అన్ని ఆలోచించే 2014ల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చానని పవన్ తెలిపారు.. నా బలమేంటో నాకు తెలుసనీ.. ప్రజల ప్రయోజనాలకోసమే పొత్తులు ఉంటాయని జనసేనాని అన్నారు.

గత ఎన్నికల్లో పోల్చుకుంటే జనసేన బలం భారీగా పెరిగిందన్నారు జనసేనాని.. 2014లో 8 శాతం ఉన్న ఓటింగ్.. ఇప్పుడు 16 నుంచి 18 శాతానికి పెరిగిందన్నారు. నాకు సీఎం పదవి కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని.. కష్టపడి పనిచేస్తే ప్రజలే అందెలం ఎక్కిస్తారని చెప్పారు. గత ఎన్నికల్లో కర్ణాటక కుమారస్వామిలాగా 30 సీట్లు వచ్చిఉంటే నేను కూడా ముఖ్యమంత్రిని అయ్యేవాడినన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎక్కువమంది జనసేన అభ్యర్థులను అసెంబ్లీలో చూడాలన్నదే తన ఆశయమని పవన్ తెలిపారు.

Updated On 11 May 2023 7:19 AM GMT
Ehatv

Ehatv

Next Story