Pawan kalyan : పవన్ కళ్యాణ్‌కు ఎదురుబడ్డ మరో పపన్ కల్యాన్
ఏ ముహూర్తాన పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ నియోజకవర్గాన్ని పవన్ కల్యాణ్(Pawan kalyan) ఎంచుకున్నారో కానీ, ఆయనకు ఏదీ అచ్చి రావడం లేదు. అసలే గెలుపోటముల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆయనకు మరో పవన్ కల్యాణ్ చుక్కలు చూపిస్తున్నాడు. 2019లోనే పవన్ భీషణ ప్రతిజ్ఞలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్‌ను ముఖ్యమంత్రిని కానవ్వను అంటూ బీరాలు పలికారు.
ఏ ముహూర్తాన పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ నియోజకవర్గాన్ని పవన్ కల్యాణ్(Pawan kalyan) ఎంచుకున్నారో కానీ, ఆయనకు ఏదీ అచ్చి రావడం లేదు. అసలే గెలుపోటముల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆయనకు మరో పవన్ కల్యాణ్ చుక్కలు చూపిస్తున్నాడు. 2019లోనే పవన్ భీషణ ప్రతిజ్ఞలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్‌ను ముఖ్యమంత్రిని కానవ్వను అంటూ బీరాలు పలికారు. అంతేసి డైలాగులు కొట్టిన పవన్ కల్యాణ్ అటు గాజువాకలోనూ, ఇటు భీమవరంలోనూ ఓడిపోయారు. మరోవైపు జగన్ మాత్రం దర్జాగా గెలిచారు. ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అప్పుడు పవన్‌కు జ్ఞానబోధ కలిగాలి కదా! కొంచెం కూడా రాలేదు. అందుకే ఈసారి కూడా సినిమా డైలాగులన్నీ వల్లెవేశారు. హే జగన్ .. కాచుకో.. నిన్న అధః పాతాళానికి తొక్కిపడేస్తా.. అంటూ ఎదురుగుండా ఉన్న మైక్ బద్దలయ్యేట్టుగా లౌడ్‌గా మాట్లాడారు. జగన్‌ను(CM Jagan) తొక్కడం సంగతి సరే.. ముందు నీ సంగతేమిటో చూసుకోమంటున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. ఎంతో ఆలోచించి, ఎన్నో లెక్కలు వేసుకుని పిఠాపురాన్ని ఎంచుకున్నారు పవన్. పైగా తన గురువు చంద్రబాబు(Chandrababu) సలహా కూడా తీసుకున్నారు. కాపు సామాజికర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న పీఠాపురం ఈసారి తనను అసెంబ్లీకి పంపిస్తున్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక పిఠాపురంలో విజయం సాధించడం కోసం వర్మ ఇంటికి వెళ్లారు. అన్నట్టు ఈ వర్మనే అప్పుడెప్పుడో పేకాట క్లబ్బుల ఓనర్ అని విమర్శించారు పవన్. ఇప్పుడు అవసరం కాబట్టి ఆయన కాళ్లు చేతులు పట్టుకుని, నా గెలుపు నీ చేతలో ఉందంటూ వేడుకున్నారు. వర్మ నిండు హృదయంతో పని చేస్తారో చేయరో తెలియదు కానీ చేస్తారనే పవన్ అనుకుంటున్నారు. అలా అనుకునే ఆయన పిఠాపురం వెళ్లారు. అక్కడ పవన్‌కు మరో పవన్ కల్యాణ్ ఎదురుపడ్డారు. ఆయన ఎవరంటే నవరంగ్ నేషనల్ పార్టీ(Navarang National Party) అభ్యర్థి. ఆయన పేరు కూడా కె.పవన్ కల్యాణే! పైగా ఆయన పోటీ చేస్తున్నది బకెట్ గుర్తు మీద! బకెట్ సింబల్, గాజ గ్లాసు సింబల్ చూట్టానికి ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఓటర్ కాసింత కన్ఫ్యూజ్ అయ్యి గాజు గ్లాస్‌కు నొక్కే బదులు బకెట్ గుర్తు మీద నొక్కారే అనుకుందాం! అప్పుడెలా అని ఇప్పట్నుంచే టెన్షన్ పడుతున్నారు పవన్. ఓ రెండు మూడు వేల ఓట్లు అలా పడితే మాత్రం తనకు ఓటమి తప్పదని జనసేన అధినేత పవన్ అనుకుంటున్నారట!