వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి అధికారంలోకి రావాలి..ఇది ప్రతిపక్ష టీడీపీ(TDP) ఏకైక లక్ష్యం. దీని కోసం సర్వశక్తులను ఒడ్డుతోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. అధికార వైసీపీని(YCP) ఎదుర్కోవాలంటే జనసేనతో పొత్తులో వెళ్లడమే సరైన నిర్ణయమని భావించింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల రెండు పార్టీలు నష్టపోయాయి. ఈసారి అలా జరుగకూడదనే పొత్తులో వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నా రెండు పార్టీల మధ్య సీట్ల లెక్క తేలలేదు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి అధికారంలోకి రావాలి..ఇది ప్రతిపక్ష టీడీపీ(TDP) ఏకైక లక్ష్యం. దీని కోసం సర్వశక్తులను ఒడ్డుతోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. అధికార వైసీపీని(YCP) ఎదుర్కోవాలంటే జనసేనతో పొత్తులో వెళ్లడమే సరైన నిర్ణయమని భావించింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల రెండు పార్టీలు నష్టపోయాయి. ఈసారి అలా జరుగకూడదనే పొత్తులో వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నా రెండు పార్టీల మధ్య సీట్ల లెక్క తేలలేదు. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన(Janasena) పోటీ చేసే స్థానాలపై మీడియాలో(Media) రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. తాజాగా టీడీపీ 112, జనసేన 63 స్థానాల్లో పోటీ చేస్తాయంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనుక జనసేన ఉందని టీడీపీ అనుమానిస్తోంది. ఎలాగైనా జ‌న‌సేన‌కు సాధ్యమైన‌న్ని త‌క్కువ సీట్లు ఇచ్చి, కేవ‌లం మ‌ద్దతు మాత్రమే పొంద‌గ‌లిగితేనే త‌మ‌కు లాభ‌మ‌ని టీడీపీ ఉద్దేశంగా ఉంది.

గతంలో మెజార్టీ సీట్లలో పోటీ చేసినా..జనసేన గెలుచుకుంది ఒక సీటు మాత్రమే. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. ఒకప్పుడు అభ్యర్థులు దొరకని పరిస్థితి నుంచి టిక్కెట్ కోసం పోటీపడే పరిస్థితి జనసేనలో కనిపిస్తోంది. ఇటీవల ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులు జనసేనలో చేరుతున్నారు. పొత్తులో కనీసం సీటైనా దక్కుతుందనేది వారి నమ్మకం. ఈ నేపథ్యంలో జనసేన ఈసారి సీట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే కాపు కురువృద్ధుడు చేగొండి హ‌రిరామ జోగ‌య్య(Hari Rama Jogaiah) 60 సీట్ల గురించి ప‌వ‌న్‌తో(Pawan kalyan) చ‌ర్చించిన‌ట్టు ప్రకటించారు. ఇప్పుడు జ‌న‌సేన 63 సీట్లలో పోటీ చేస్తుంద‌నే ప్రచారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ ప్రచారాన్ని జనసేన ఎక్కడా ఖండించలేదు. ఇందులో అబ‌ద్ధం వుంటే, జ‌న‌సేన‌-టీడీపీ ఉమ్మడిగా ఖండించాలి క‌దా? ఆ ప‌ని జ‌న‌సేన ఎందుకు చేయ‌డం లేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమ‌య్యాయి. అందుకే ఈ ప్రచారం వెనుక జ‌న‌సేన వుంద‌ని టీడీపీ నేత‌లు అనుమానిస్తు్న్నారు. అటు టీడీపీ కేవ‌లం 112 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంద‌నే ప్రచారంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెల‌కుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలను తమ కేటాయించాలని జనసేన కోరడం టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు. చాలా చోట్ల రెండు పార్టీల నేతల మధ్య అప్పుడే వైరం మొదలైంది. సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల పేరుతో త‌మ‌ను జ‌న‌సేన‌ బ్లాక్ మెయిల్ చేస్తోంద‌ని టీడీపీ నేత‌లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సమస్యగా మారనుంది. ఇరు పార్టీల అధినేతలు ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Updated On 25 Jan 2024 5:55 AM GMT
Ehatv

Ehatv

Next Story