జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఓ మాట మీద నిలబడే మనిషి కాదన్న విషయం అందరికీ తెలుసు. మాట మార్చడంలో ఆయన లబ్ధప్రతిష్టుడు. చే గువేరా బొమ్మ పెట్టుకుని కాషాయానికి జై కొట్టాడంటేనే పవన్‌ ఎలాంటివాడో అర్థమవుతోంది. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల(Muslim Reservation) విషయంలో పవన్‌ తొందరపడ్డారేమోననిపిస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను ఇప్పటి వరకు బీజేపీ ఒక్కటే వ్యతిరేకిస్తోంది.

జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఓ మాట మీద నిలబడే మనిషి కాదన్న విషయం అందరికీ తెలుసు. మాట మార్చడంలో ఆయన లబ్ధప్రతిష్టుడు. చే గువేరా బొమ్మ పెట్టుకుని కాషాయానికి జై కొట్టాడంటేనే పవన్‌ ఎలాంటివాడో అర్థమవుతోంది. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల(Muslim Reservation) విషయంలో పవన్‌ తొందరపడ్డారేమోననిపిస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను ఇప్పటి వరకు బీజేపీ ఒక్కటే వ్యతిరేకిస్తోంది. బీజేపీ(BJP) వద్దంటుందంటే దానికో అర్థం పరమార్థం ఉంది. మొదట్నుంచి బీజేపీ హిందూ పార్టీ(Hindu party) కాబట్టి మత ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకం. మరి పవన్‌ కల్యాణ్‌కు ఏమైంది? ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలన్నది పవన్‌ అభిమతం కూడా! మొన్నామధ్య ఓ ఇంగ్లీష్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్నది చెప్పేశారు. 'బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్నది కదా! అలాంటి బీజేపీతో మీరు పొత్తు పెట్టకున్నారు. రాజకీయంగా మీకు ఏమైనా నష్టం వస్తుందని మీరు నిరాశ, ఆందోళన చెందుతున్నారా'? అని పవన్‌ను ప్రశించారు మీడియా ప్రతినిధి. అబ్బే అలాంటిదేమీ లేదు. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ చెప్పడంపై తానేమీ నిరాశ, ఆందోళన చెందడం లేదని పవన్‌ చెప్పుకొచ్చారు. ముస్లింల రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కంటే, యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు, నైపుణ్యాలు పెంచేలా శిక్ష‌ణ ఇప్పించడం మంచిదని పవన్‌ తెలిపారు. ఇదే సమయంలో కాపు సామాజికవర్గానికి కూడా రిజర్వేషన్లు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై పవన్‌ చేసిన కామెంట్‌ టీడీపీని ఇరకాటంలో పెట్టింది. ఎన్నికల వేళ ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలా ఏదిపడితే అది మాట్లాడకూడదని టీడీపీ అంటోంది. పవన్‌ వ్యాఖ్యలు ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని ఆందోళన చెందుతోంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలో పవన్‌కు తెలియదని టీడీపీ చెప్పుకొస్తోంది.

Updated On 10 May 2024 12:54 AM GMT
Ehatv

Ehatv

Next Story