సమయం లేదు మిత్రమా..అన్నటు.. నోటిఫికేషన్‎కు ముందే ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకేశాయి. ఇప్పటికే ఇటు వైసీపీ(YCP)..అటు డీపీపీ(TDP)..రెండు పార్టీలూ ఎన్నికల(Elections) శంఖారావాన్ని పూరించాయి. ఎన్నికల సిద్ధం అంటూ అధికార వైసీపీ ప్రకటించగా..రా కదిలి రా అంటూ టీడీపీ..ఎన్నికల ప్రచారాన్ని(Election campaing) మొదలు పెట్టాయి.

సమయం లేదు మిత్రమా..అన్నటు.. నోటిఫికేషన్‎కు ముందే ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకేశాయి. ఇప్పటికే ఇటు వైసీపీ(YCP)..అటు డీపీపీ(TDP)..రెండు పార్టీలూ ఎన్నికల(Elections) శంఖారావాన్ని పూరించాయి. ఎన్నికల సిద్ధం అంటూ అధికార వైసీపీ ప్రకటించగా..రా కదిలి రా అంటూ టీడీపీ..ఎన్నికల ప్రచారాన్ని(Election campaing) మొదలు పెట్టాయి. తాజాగా..జనసేనాని(Janasena) సైతం అధికార వైసీపీకి ధీటుగా ఉత్తరాంధ్ర(Uttarandhra) అనకాలపల్లిలో(Anakapally) భారీ బహిరంగ సభకు(Public Meeting) ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. శ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి దీవెనలతో ఫిబ్రవరి 4న ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జనసేన బాగా ఫోకస్ పెట్టిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ఒకటి. ఈసారి ఉత్తరాంధ్రలోని కొన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదం ప్రకటించడం ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పవన్ కళ్యాణ్ పూరిస్తారని తెలుస్తోంది. దివరకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఐదేళ్లతో పోల్చితే, అభిమానులతోపాటూ, జనసేన కార్యకర్తల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పుడు సమర శంఖం పూరించడం ద్వారా ఆ పార్టీకి మరింత మైలేజ్ పెరుగుతుందనే అంచనాలున్నాయి. అనకాపల్లి జిల్లా నాయకులతో ఇవాళ సన్నాహాక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం అనంతరం బహిరంగ సభ ఏర్పాటుపై పార్టీ నేతలు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ బహిరంగ సభకు జనసేనాని ముఖ్య అతిథిగా హాజరురవుతారు. అలాగే.. అనకాపల్లి సభలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సహా..మరికొందరు అధికారికంగా జనసేనలో చేరబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం.

Updated On 29 Jan 2024 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story