తాడేపల్లిగూడెం సభకు వెళ్లాలా లేదా అనేది కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని

జనసేన కేవలం 24 సీట్లలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని చాలా మంది జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏలూరు జనసేన ఇంచార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు పార్టీ విషయంలోనూ.. పార్టీ అభ్యర్థుల విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 కంటే బలపడిన జనసేన పార్టీ తక్కువ సీట్లు తీసుకోవడం, పవర్ షేరింగ్ లేకపోవడం వల్ల జన సైనికుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్‌ఫర్‌ అవుతాయా ? లేదా? అనే అనుమానం కలుగుతుందన్నారు. జనసేన తరఫున పోటీ చేయబోయే 24 మందిలో ఎంతమంది గెలుస్తారో తెలియదు.. గెలిచినవారు పార్టీలో ఉంటారో లేదో అనుమానమే అంటూ వ్యాఖ్యలు చేశారు అప్పలనాయుడు.

తాడేపల్లిగూడెం సభకు వెళ్లాలా లేదా అనేది కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అన్నారాయన. భవిష్యత్తులో జనసేనకు ఊపిరి ఉంటుందా? లేదా అనే విషయాన్ని భట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని తెలిపారు. అధికారంలో షేర్ లేకుండా తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనిపించట్లేదన్నారు. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ప్రకటించిన దానికి భిన్నంగా సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. ఏలూరులో జనసేన కచ్చితంగా గెలిచేదని అన్నారు అప్పలనాయుడు.

Updated On 27 Feb 2024 12:18 AM GMT
Yagnik

Yagnik

Next Story