వైసీపీ అధినేత‌, ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ వై నాట్ 175 అంటున్నారు.. ఈసారి ఎన్నికల్లో సాక్షాత్తు దేవుడే దిగివచ్చి పోటీ చేసినా 175కి 175 గెలవడం అసాధ్యమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు.

వైసీపీ అధినేత‌, ముఖ్యమంత్రి జ‌గ‌న్‌(YS Jagan) 'వై నాట్ 175' అంటున్నారు.. ఈసారి ఎన్నికల్లో సాక్షాత్తు దేవుడే దిగివచ్చి పోటీ చేసినా 175కి 175 గెలవడం అసాధ్యమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు(Nagababu) అన్నారు. ఆదివారం నెల్లూరు రూరల్(Nellore Rural), కావలి(Kavali), ఆత్మకూరు(Athmakur), ఉదయగిరి(Udayagiri) నియోజకవర్గాల పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ ఒక రాక్షస గణం అని, ఈసారి కూడా ఆ పార్టీ గెలిస్తే సగం రాష్ట్రం ఖాళీ అయిపోతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడకపోతే వైసీపీని గద్దె దించలేమని అన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక వైసీపీ(YCP) ప్రభుత్వం వంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రాష్ట్రంలోనూ చూడలేదని విమ‌ర్శించారు. ఎన్నికలకు ఇక 100 రోజుల సమయం మాత్రమే ఉందని, ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలన్నదానిపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇక, ఈసారి ఎన్నికల్లోనూ తాను ఎంపీగా పోటీ చేస్తానని ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని నాగబాబు స్పష్టం చేశారు. తనకు పదవులపై ఆసక్తి లేదని అన్నారు.

రెండు రాష్ట్రాల్లో ఓటుపై వ‌స్తున్న విమర్శలపై ఆయ‌న‌ స్పందించారు. ఏపీకి ఓటు మార్చుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాదు(Hyderabad)లో ఉన్న ఓటును క్యాన్సిల్(Cancel) చేసుకున్నాను అని తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ(Telangana) ఎన్నికల్లో నేను, నా కుటుంబం ఓటు వేయలేదు. మంగళగిరి(Mangalagiri)లో ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే, ఓటు హక్కు రాకుండా బూత్ లెవల్ స్థాయిలో కూడా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

Updated On 17 Dec 2023 9:03 AM GMT
Yagnik

Yagnik

Next Story