Nadendla Manohar: నాదెండ్ల మనోహర్‌పై దాడి.. కావాలనే జరిగిందా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని టీడీపీ–జనసేన మధ్య పొత్తు పొడిచింది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని టీడీపీ–జనసేన మధ్య పొత్తు పొడిచింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ పొత్తు గురించి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. జనసేన నేతలను టీడీపీ నేతలు చాలా ప్రాంతాల్లో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక తెనాలిలో కూడా ఇరు పార్టీల మధ్య అసలు సఖ్యత కుదరలేదు. అందుకే ఎప్పుడు ఏమి జరుగుతుందా అనే టెన్షన్ కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు ఊహించని షాక్ తగిలింది.
టీడీపీ–జనసేన నేతల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయనే వాదనకు ఈ ఘటన ఒక సాక్ష్యం మాత్రమే. నాదెండ్ల మనోహర్‌పై కొందరు నీళ్ల బాటిల్‌తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగలడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్ టాకీస్ దగ్గరకు చేరిన సమయంలో.. టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) వచ్చి కలిశారు. రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ళ్ల బాటిల్‌ను నాదెండ్ల మనోహర్‌పైకి విసిరారు. అది ఆయన తలకు తగిలింది. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. కావాలనే చేసి ఉంటారని ఓ వర్గం అంటుండగా.. అనుకోకుండా జరిగిన ఘటన అని మరో వర్గం అంటోంది.