TDP-Janasena-BJP మూడు పార్టీల మధ్య సర్దుబాటు.. ఎట్టకేలకు!
175 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు గాను 8 స్థానాలను బీజేపీ-జనసేనకు కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు సీట్ల పంపకానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు గాను 8 స్థానాలను బీజేపీ-జనసేనకు కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుండగా, బీజేపీ 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలతో దాదాపు ఎనిమిది గంటల సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీల ఒప్పందం కుదిరింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు.
ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే జనసేన కూడా తన సీట్లను తగ్గించుకుంది. ఇంతకు ముందు జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీ పొత్తులోకి వచ్చిన నేపథ్యంలో జనసేన సర్దుకుంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా... బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది.