జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాకినాడ(Kakinada)లో పర్యటిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో 20 మందితో పవన్ కళ్యాణ్ చర్చించారు. క్షేత్ర స్థాయిలో జనసేన(Janasena) పరిస్థితిపై ఆరా తీశారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలని, అటు టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని పవన్ సూచించారు.

కాకినాడ నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ(TDP) మద్దతు ఉంటుంది కాబట్టి ఈసారి కాకినాడ సిటీ సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశపై పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాకినాడ సిటీ సీటుపై చర్చలు జరిపి పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే కాకినాడ సిటీ(Kakinada City)లో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(Dwarampudi Chandrashekar Reddy)ని పవన్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే జనసేనాని కాకినాడను ప్రత్యేకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated On 29 Dec 2023 9:20 PM GMT
Yagnik

Yagnik

Next Story