జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకత్వాన్ని కలవాలని అనుకున్నారు

వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో తెలుగుదేశం-జనసేన కూటమి పని చేస్తూ ఉంది. అయితే కూటమికి ఏదీ కలిసి రావడం లేదు. చాలా ప్రాంతాల్లో జనసేన నాయకులకు టీడీపీ నేతలు కనీసం సహకరించడం లేదని తెలుస్తోంది. జనసేన నేతలని ఏదో పిలవాలంటే.. పిలవాలి.. అని కార్యక్రమాలకు పిలుస్తున్నారు తప్పితే జనసేన నాయకులకు కనీస మర్యాద ఇవ్వడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. తమకు అవమానం జరుగుతోందని జనసేన అధిష్టానం దగ్గర చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు. ఇక ఢిల్లీకి చేరిన రాజకీయాన్ని చూస్తే.. బీజేపీతో జట్టు కట్టాలని టీడీపీ-జనసేన ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయితే ఈ పొత్తు తేలడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది. రేపో మాపో జనసేనాని ఢిల్లీ వెళతారనే ప్రచారం సాగింది. తీరా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే పవన్ ఢిల్లీ పర్యటన లేనట్టేనని తెలుస్తూ ఉంది.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిసి వచ్చారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకత్వాన్ని కలవాలని అనుకున్నారు. అయితే, పవన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన ఢిల్లీ వెళ్లడానికి ముందు చంద్రబాబును కలవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో ఇద్దరు నాయకుల మధ్య చర్చ జరగనుంది. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరలేదు. మరో వైపు జనసేనతో తాము కలిసే ఉన్నామని బీజేపీ చెబుతోంది.

Updated On 11 Feb 2024 4:18 AM GMT
Yagnik

Yagnik

Next Story