పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ లో జరిగిందిదే..|| Pawan Kalyan Delhi Tour Detailed Analysis|| JournalistYNR
జనసేన అధినేత(Janase Chief) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవల ఢిల్లీ(Delhi) వెళ్లారు. జనసేనాని ఢిల్లీ పర్యటన(Delhi Tour)పై పలు రకాల అనుమానాలు చెలరేగుతున్నాయి. గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ రెండు ప్రధాన అంశాల గురించి తరచూ మాట్లాడుతూ వస్తున్నారు. అందులో ఒకటి వైసీపీ(YCP) వ్యతిరేక ఓటును చీలనివ్వను అనేది ఒకటైతే.. జగన్(YS Jagan) ను అధికారం నుంచి దించడమే లక్ష్యం అనేది మరొకటి. ఈ పర్యటనలో పవన్ పలు కేంద్ర మంత్రులతో, జాతీయ అధ్యక్షుడు నడ్డా(JP Nadda)తో కలిసి కొన్ని కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది.
జనసేన అధినేత(Janasena Chief) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవల ఢిల్లీ(Delhi) వెళ్లారు. జనసేనాని ఢిల్లీ పర్యటన(Delhi Tour)పై పలు రకాల అనుమానాలు చెలరేగుతున్నాయి. గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ రెండు ప్రధాన అంశాల గురించి తరచూ మాట్లాడుతూ వస్తున్నారు. అందులో ఒకటి వైసీపీ(YCP) వ్యతిరేక ఓటును చీలనివ్వను అనేది ఒకటైతే.. జగన్(YS Jagan) ను అధికారం నుంచి దించడమే లక్ష్యం అనేది మరొకటి. ఈ పర్యటనలో పవన్ పలు కేంద్ర మంత్రులతో, జాతీయ అధ్యక్షుడు నడ్డా(JP Nadda)తో కలిసి కొన్ని కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. పోలవరం ఇష్యూ(Polavaram project issue), వైజాగ్ స్టీల్ ప్లాంట్(Visakhapatnam Steel Plant) ప్రైవేటీకరణ ఇలా పలు పలు అంశాలపై చర్చించారు.
జనసేనాని టూర్లో ముఖ్యమైన అంశంగా ఉంది టీడీపీతో పొత్తు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే గెలుపు ఖాయమని సర్వేలు చెప్తున్నాయని పవన్ వివరించినట్లు తెలుస్తుంది.. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు పోవాలని సిద్ధంగా లేదు. అయితే పవన్ మాత్రం టీడీపీతోనే ఉంటానని దానికి బీజేపీ సహకారం కోరినట్టు తెలుస్తుంది. టీడీపీని,బీజేపీని కలిపేందుకు పవన్ రాయబారిగా ఉన్నారని కొంత మంది నేతలు మాట్లాడుతున్నారు.. ఇంతకీ పవన్ మాటలను బీజేపీ పట్టించుకుంటుందా..? రాబోయే ఎన్నికల్లో ముగ్గురు కలిసి పోటీ చేస్తారా అనే దానిపైనే ఆసక్తి నెలకొంది.