Pawan kalayan : రెండు చోట్ల పోటీనా? కుదరదంటే కుదరదు.. : పవన్‌తో చంద్రబాబు
జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు(Pawankalayan) పెద్ద సమస్య వచ్చిపడింది. ఎక్కడ్నుంచి పోటీ చేయాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఏదో ఒక చోటు నుంచి పోటీ చేసే బదులు గత ఎన్నికల్లోల్లాగే రెండు చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఏదో ఒక చోట గెలవచ్చన్నది పవన్ భావన. అయితే పవన్ రెండు చోట్ల పోటీ చేయడం టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడుకు సుతరామూ ఇష్టం లేదు.
జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు(Pawankalayan) పెద్ద సమస్య వచ్చిపడింది. ఎక్కడ్నుంచి పోటీ చేయాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఏదో ఒక చోటు నుంచి పోటీ చేసే బదులు గత ఎన్నికల్లోల్లాగే రెండు చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఏదో ఒక చోట గెలవచ్చన్నది పవన్ భావన. అయితే పవన్ రెండు చోట్ల పోటీ చేయడం టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడుకు సుతరామూ ఇష్టం లేదు. తాను కుప్పం(Kuppam) నుంచి మాత్రమే పోటీ చేస్తున్నానని, తన కుమారుడు లోకేశ్(Lokesh) కూడా మంగళగిరి నుంచి మాత్రమే పోటీ చేస్తున్నాడని చెబుతూ భయపడకుండా ధైర్యంగా ఎన్నికల కదనరంగంలో దూకాలని అంటున్నారు చంద్రబాబు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న భీమవరం(Bhimavaram) నుంచి పోటీ చేయాలని పవన్‌కల్యాణ్ అనుకున్నారు. ఇందుకు చంద్రబాబు, లోకేశ్‌లు కూడా పర్మిషన్ ఇచ్చేశారు. ఈ ఒక్కచోట నుంచే పోటీ చేయాలని కొన్ని నెలల కిందట పవన్‌కు తండ్రి కొడుకులిద్దరూ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయని, ఎక్కడ్నుంచి పోటీ చేసినా అవలీలగా విజయం సాధించగలుగుతామని పవన్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయనలో కొంచెం భయం మొదలైనట్టుగా ఉంది. పోటీ చేసి ఓడిపోతే అంతకు మించిన పరాభవం ఉండదు. ఎందుకంటే కిందటిసారే పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిని చవి చూసి నలుగురితో నానా మాటలనిపించుకున్నారు. ఈసారి అలా కాకూడదన్నది పవన్ ఆలోచన. అందుకే పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 24 సీట్లలో రెండు చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నారట! ఈ మాటే చంద్రబాబుతో చెప్పినట్టు సమాచారం. రెండు చోట్ల పోటీ చేస్తే ప్రజలకు అనుమానం కలుగుతుందని, ఓటమి భయంతోనే ఇలా రెండు నియోజకవర్గాలను ఎంచుకున్నారని జనం అనుకునే ప్రమాదం ఉందని చంద్రబాబు నచ్చచెప్పారట! ఇప్పుడు పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తిగా మారింది.