Pavan Kalyan: పవన్ పర్యటన వాయిదా.. మళ్లీ ఏమైందో?
అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అభ్యంతరం తెలపడానికి కారణం ఉంది. పోలీసు శాఖ నుంచి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫిబ్రవరి 14 నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 14న భీమవరం నుంచి తన పర్యటన ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ భావించారు. ఆయన పర్యటన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో భీమవరం వెళ్లాలనుకున్నారు. భీమవరంలో జనసేన నేతలు హెలిప్యాడ్ కూడా సిద్ధంచేశారు. అయితే, అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. భీమవరంలో పవన్ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే తెలియజేస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు. భీమవరం విష్ణు కాలేజి ప్రాంగణంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెలీప్యాడ్ లో పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలీప్యాడ్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారని జనసేన నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. విష్ణు కాలేజిలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చెబుతున్నారని ఆరోపించారు.
అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అభ్యంతరం తెలపడానికి కారణం ఉంది. పోలీసు శాఖ నుంచి అనుమతి లభించినప్పటికీ ఆర్‌అండ్‌బీ శాఖ మాత్రం అనుమతి ఇవ్వలేదు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రాంతానికి యాభై మీటర్ల దూరంలో భవనాలు ఉండటంతో వారు అనుమతిని నిరాకరించారు. హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ల్యాండింగ్ అయ్యే ప్రాంతానికి మరీ అంత దగ్గరగా.. ఎలాంటి భవనాలు ఉండకూడదని అంటున్నారు అధికారులు.