Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అయిదేళ్ల సంపాదన ఎంతో తెలుసా..?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు తెలిపారు.

Janasena Chief Pawan Kalyan assets grew by 191 percent in the past five years
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు తెలిపారు. పవన్ కల్యాణ్ ఆస్తులు గత ఐదేళ్లలో 191 శాతం పెరిగాయి. తనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట మొత్తం రూ.163 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. 2019లో ఆయన ఆస్తులు రూ.56 కోట్లు కాగా ఆయిదేళ్లలో అవి భారీగా పెరిగాయి.
గత అయిదేళ్ళలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114,76,78,300(రూ.114.76 కోట్లు)గా పేర్కొన్నారు. ఈ సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీకి రూ.26,84,70,000 చెల్లించినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కు అప్పులు రూ.64,26,84,453 ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46 కోట్ల 70 లక్షలు ఉన్నాయని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు. వివిధ సంస్థలకు రూ.3,32,11,717 విరాళాలు అందచేశారు.
ఆ వివరాలివి..
కేంద్రీయ సైనిక్ బోర్డు - రూ.1 కోటి
పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ – రూ.1 కోటి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ – రూ.30,11,717
పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ – రూ.2 లక్షలు
