సినిమాలు, రాజకీయాలు బ్యాలన్స్ చేసుకుంటూ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) బాగా కష్టపడుతున్నారు. జనసేన పార్టీ(Janasena)పై దృష్టి పెట్టిన పవన్.. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలో పార్టీలో తనతో పాటు కలిసి వచ్చిన తన అన్న నాగబాబుకు కీలక పదవి అప్పగించారు పవర్ స్టార్.సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న హీరో పవర్ స్టార పవన్ కళ్యాణ్.

సినిమాలు రాజకీయాలు బ్యాలన్స్ చేసుకుంటూ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) బాగా కష్టపడుతున్నారు. జనసేన(Janasena) పార్టీపై దృష్టి పెట్టిన పవన్.. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలో పార్టీలో తనతో పాటు కలిసి వచ్చిన తన అన్న నాగబాబుకు కీలక పదవి అప్పగించారు పవర్ స్టార్.

సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న హీరో పవర్ స్టార పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో ఏ హీరోకు లేనంతగా ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఆయన ప్రజలకు సేవ చేయడానికి జనసేన పార్టీ స్థాపించి.. నటుడిగా సినిమాలు చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు.. రాజకీయ నాయకుడిగా ప్రజల కష్టాలు కూడా తెలుసుకుంటున్నాడు. ఇక తనతో పాటు తన అన్న నాగబాబు కూడా జనసేనలో తమ్ముడితో కలిసి నడుస్తున్నాడు.

నాగబాబు(Nagababu) పార్టీలోకి వచ్చి చాలా కాలం అవుతోంది. అయితే ఇప్పటి వరకూ నాగాబాబు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. విదేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు, అభిమానులను నాగబాబు సమన్వయపరుస్తారు. ఇక పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాన్ కి అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఆయన సోదరుడు నాగబాబు. తాజాగా జనసేన పార్టీలో నాగబాబుకి కీలక పదవి అప్పగించారు పవన్ కళ్యాణ్.

జనసేన పార్టీలో ముందు నుంచి కీలక వ్యక్తిగా కొనసాగుతూ వస్తున్నారు కొణిదెల నాగబాబు. తాజాగా నాగబాబుని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు. శుక్రవారం ఏప్రిల్ 14, జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగబాబుకు పవన్ కళ్యాన్ స్వయంగా బ్యాడ్జీ తొడిగారు. ఆయన సేవలు మరింత విసృతం చేయాలనే ఉద్దేశంతో పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించడంపై జనసేన కర్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ హీరోగా టాలీవుడ్ లో తన మార్క్ చూపించిన పవర్ స్టార్.. రాజకీయ నాయకుడిగా ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశ్యంతో 2014 లో.. జనసేన పార్టీని స్థాపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి ఎన్ని విమర్షల్ ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. 2019 ఎన్నికల్లో ఫెయిల్యూర్ ఎదురైనా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ప్రజల కోసం పోరాడుతూ.. అధికార పార్టీనీ ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఈ సారి ఎలక్షన్స్ లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు పవర్ స్టార్.

Updated On 15 April 2023 6:21 AM GMT
Ehatv

Ehatv

Next Story