Janasena : దూకుడు పెంచిన జనసేనాని.. ఆ మూడు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లు
రానున్న ఎన్నికల కోసం జనసేనను సిద్ధం చేస్తున్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను నియమిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
రానున్న ఎన్నికల కోసం జనసేన(Janasena)ను సిద్ధం చేస్తున్నారు అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఈ నేపథ్యంలోనే మూడు అసెంబ్లీ నియోజకవర్గాల(Assembly Constituencies)కు కొత్త ఇంఛార్జ్(New Incharges)లను నియమిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(Uday Srinivas), రాజానగరం(Raja Nagaram) నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ(Bathula Balaramakrishna), కొవ్వూరు(Kovvuru) నియోజకవర్గానికి టీ.వీ రామారావు(TV Ramarao)లను ఇంఛార్జ్‌లుగా నియమించారు. టీవీ రామారావు గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ఆదివారం మంగళగిరి(Mangalagiri) జనసేన పార్టీ కార్యాలయంలో ఈ ముగ్గురికీ పవన్ కళ్యాణ్ నియామక పత్రాలను అందజేశారు.
అలాగే.. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్(Producer BVSN Prasad)కు కీలక బాధ్యతలు అప్పగించారు జనసేనాని. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి(కార్యక్రమాల నిర్వహణ కమిటీ)గా నియమిస్తూ.. నియామక పత్రం అందచేశారు. నూతనంగా నియమితులైన వారికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి దోహదపడాలని.. ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు.
ఇప్పటి వరకు రాజానగరం, పిఠాపురం ఇంఛార్జ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించిన మేడా గురుదత్(Gurudath), మాకినీడు శేషుకుమారి(Sheshu Kumari)లకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని.. వారి సేవలను పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు.