ఎట్టకేలకు తెలుగుదేశం(TDP), జనసేన(Janasena) పార్టీల మధ్య సీట్ల(MLA Seats) సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. సోషల్‌ మీడియాలో(Social media) వైరల్ అవుతున్న ఓ కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ 114 స్థానాలలో పోటీ చేయబోతున్నది. మిగతా 61 అసెంబ్లీ స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది. రెండు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ సమావేశంలో సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారట! సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో అయిదు స్థానాలలో టీడీపీ, మూడు స్థానాలో జనసేన పోటీ చేయబోతున్నాయి. ఇచ్చాపురం, టెక్కలి, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు పోటీపడతారు. పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల నుంచి జనసేన పోటీ చేస్తుంది. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, శృంగవరపుకోట స్థానాలలో టీడీపీ, రాజం, గజపతినగరం, నెల్లిమర్ల లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది.

పార్వతిపురం మన్యం జిల్లాలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరులలో టీడీపీ, పాలకొండ నుంచి జనసేన పోటీ చేస్తాయి. విశాఖపట్నం జిల్లాలో భీమిలి, విశాఖపట్నం పశ్చిమ, గాజువాక నుంచి జనసేన , విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం దక్షిణం నుంచి టీడీపీ పోటీ చేస్తాయి. అల్లూరి సీతారామారాజు జిల్లాలో పాడేరు నుంచి జనసేన, అరకు, రంపచోడవరం నుంచి టీడీపీ పోటీ చేస్తాయి. అనకాపల్లి జిల్లాలో చోడవరం, పెందుర్తి, యలమంచలి నుంచి జనసేన, మాడుగుల, అనకాపల్లి, పాయకారావుపేట, నర్సిపట్నం నుంచి టీడీపీ పోటీ చేస్తాయి. కాకినాడ జిల్లాలో తుని, పెద్దాపురం, జగ్గంపేట నుంచి టీడీపీ, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ నుంచి జనసేన బరిలో దిగుతాయి. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం, పి.గన్నవరం, మండపేట నుంచి టీడీపీ, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, కొత్తపేట నుంచి జనసేన పోటీ చేస్తాయి.

తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ, అనపర్తి, గోపాలపురం, నిడదవోలు నుంచి టీడీపి, రాజానగరం, రాజమండ్రి రూరల్‌, కొవ్వూరుల నుంచి జనసేన పోటీ చేస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట, పాలకొల్లు, ఉండి నుంచి టీడీపీ, నర్సాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంల నుంచి జనసేన పోటీ చేస్తాయి. ఏలూరు జిల్లాలో దెందులూరు, నూజివీడు, కైకలూరు, చింతలపూడి నుంచి టీడీపీ, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం నుంచి జనసేన పోటీ చేస్తాయి. కృష్ణా జిల్లా నుంచి గన్నవరం, గుడివాడ, పామర్రు, పెనమలూరు నుంచి టీడీపీ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నుంచి జనసేన పోటీ చేస్తాయి. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి తిరువూరు, విజయవాడ వెస్ట్‌, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నుంచి టీడీపీ, విజయవాడ మధ్య, విజయవాడ తూర్పు నుంచి జనసేన పోటీ చేస్తాయి. పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, చిలకలూరిపేట, వినుకొండ, గురజాల, మాచెర్ల నుంచి టీడీపీ, నర్సారావుపేట, సత్తనపల్లి నుంచి జనసేన పోటీ చేస్తాయి.

గుంటూరు జిల్లాలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, గుంటూరు తూర్పు నుంచి టీడీపీ, తెనాలి, పత్తిపాడు, గుంటూరు పశ్చిమ నుంచి జనసేన పోటీ చేస్తాయి. బాపట్ల జిల్లాలో వేమూరు, రేపల్లే, బాపట్ల, పర్చూరు, అద్దంకి నుంచి టీడీపీ, చీరాల నుంచి జనసేన పోటీ చేస్తాయి. ప్రకాశం జిల్లాలో ఎర్రగుంటపాలెం, కొండెపి, మార్కాపురం, కనిగిరి నుంచి టీడీపీ, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు, గిద్దలూరు నుంచి జనసేన పోటీ చేస్తాయి. నంద్యాల జిల్లాలో శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లి, డోన్‌ నుంచి టీడీపీ, నంద్యాల నుంచి జనసేన పోటీ చేస్తాయి. కర్నూలు జిల్లాలో కర్నూలు, పత్తికొండ, కొడుమూరు, పాణ్యం, మంత్రాలయం, ఆలూరు నుంచి టీడీపీ, ఆదోని నుంచి జనసేన పోటీ చేస్తాయి. కడప జిల్లాలో బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు నుంచి టీడీపీ, మైదుకూరు నుంచి జనసేన పోటీ చేస్తాయి. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, కల్యాణదుర్గం, రాప్తాడు నుంచి టీడీపీ, అనంతపురం అర్బన్‌ జనసేన పోటీ చేస్తాయి. సత్యసాయి జిల్లాలో మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నుంచి టీడీపీ పోటీ చేస్తుంది. నెల్లూరు జిల్లాలో కందూకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, సర్వెపల్లి, ఉదయగిరి నుంచి టీడీపీ, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌ నుంచి జనసేన పోటీ చేస్తాయి. తిరుపతి జిల్లాలో చంద్రగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటరిగి నుంచి టీడీపీ, తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూరు నుంచి జనసేన పోటీ చేస్తాయి. అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నుంచి, మదనపల్లి, కోడూరు, రాజంపేట నుంచి జనసేన పోటీ చేస్తాయి. చిత్తూరు జిల్లాలో నగరి, గంగాధర నెల్లూరు, పుంగనూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నుంచి టీడీపీ, చిత్తూరు నుంచి జనసేన పోటీ చేస్తాయి.

Updated On 27 Jan 2024 8:09 AM GMT
Ehatv

Ehatv

Next Story