పిఠాపురం(Pithapuram) తెలుగుదేశంపార్టీ(TDP) ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌, వర్మపై(Varma) జనసేన పార్టీ(Janasena) కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు, కొబ్బరికాయలతో దాడికి(Attack) దిగడంతో వర్మ కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో పాటు పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మాట్లాడేందుకు వర్మ వెళ్లారు.

పిఠాపురం(Pithapuram) తెలుగుదేశంపార్టీ(TDP) ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌, వర్మపై(Varma) జనసేన పార్టీ(Janasena) కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు, కొబ్బరికాయలతో దాడికి(Attack) దిగడంతో వర్మ కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో పాటు పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మాట్లాడేందుకు వర్మ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారని నిలదీశారు. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పార్టీల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు అంటూ అదేపనిగా అడగడం మొదలుపెట్టారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. రాళ్లు, కొబ్బరి కాయలతో వర్మ కారుపై దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆయన కారులో వేగంగా వెళ్లిపోయారు. గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి జనసేన నేతలను అదుపులోకి తీసుకోవడం మానేసి వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. జనసేన నేతల దాడి నుంచి తప్పించుకుని వచ్చిన వర్మ గొల్లప్రోలు– చేబ్రోలుకు మధ్యలో ఉన్న తన గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి వెళితే జనసేన కార్యకర్తలు తనపై దాడికి దిగారని వర్మ ఆరోపిస్తున్నారు. అధికారం కోసం జనసేనలోకి వెళ్లిన కొందరు నేతలు తనపై దాడికి దిగారని ఆరోపించారు. తనపై ఇటుకలు, గాజు గ్లాసులు, డ్రింక్‌ సీసాలు, కంకర రాళ్లు, కర్రలతో దాడి చేశారని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated On 8 Jun 2024 4:04 AM GMT
Ehatv

Ehatv

Next Story