అల్లు రామలింగయ్య, మెగాస్టార్ కుటుంబాలు రెండు వేర్వేరు కావని..

అల్లు రామలింగయ్య, మెగాస్టార్ కుటుంబాలు రెండు వేర్వేరు కావని.. రెండు కుటుంబాలకు ఒక్కటేనని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ(Jana Sena Leader bolisetty satyanarayana) చెప్పారు. స్వయంకృషితో ఆ రెండు కుటుంబాలు ఎదిగాయని.. ఇతర కుటుంబాల పేరు వాడుకోలేదన్నారు. ఇప్పుడు పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) డైలాగులకు పెడార్థాలు తీసి అభిమానుల్లో అగ్గి రాజేసే పనిలో వైసీపీ శ్రేణులు, పెయిడ్ ఎనలిస్టులు ఉన్నారని ఆరోపించారు. సినిమాను సినిమాగానే చూడాలని, వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు. రాష్ట్రంలో తమ అధికారంలో నిలబెట్టు కోవడానికి జనసేన సహిత ఎన్డీఏ(NDA) కూటమిని ఏర్పడకుండా ఉండాలన్న దురుద్దేశంతో తన మీడియా, తన పెంపుడు మీడియా, పెయిడ్ సోషల్ మీడియా, తప్పుడు ఎనలిస్టులతో దుష్ప్రచారాలు చేశారన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా చిరంజీవి మాకే మద్దతు నిస్తున్నారని, చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరని పనికిమాలిన డిబేట్లతో మెగా ఉమ్మడి కుటుంబంలో అగ్గి రాజేయడానికి, వైసీపీ నాయకులు వ్యూహకర్తలు శత విధాల కష్టపడ్డారు.. కానీ

గారి దూరదృష్టి మరియు వ్యూహం ముందు అవి పనిచేయలేదని సత్యనారాయణ అన్నారు. అదే వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా, పెంపుడు మీడియా, పెయిడ్ ఎనలిస్టులు ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నారన్నారు. సినిమాలో అల్లు అర్జున్‌ డైలాగులకు పెడర్ధాలు తీసి మెగా కుటుంబంలో అగ్గి రాజేసే పనిలో ఉన్నారని.. ఫుల్ టైం మెగా అభిమానులను రెచ్చ గొట్టే ప్రయత్నంలోనే ఉన్నారు.. తస్మాత్ జాగర్త.. సినిమాలను సినిమాలుగానే చూస్తాం అని తిప్పి కొట్టండి.. వైసీపీ ట్రాప్ లో పడవద్దని ఆయన సూచించారు. 'ఒక అన్న తమ్ముడి జీవితాన్ని నాశనం చేసి నరకాన్ని చూపించి అవమానపర్చిన.. ఆ అన్న కూతురికి కష్టం వస్తే పుష్ప తన ప్రాణాన్ని పణంగా పెట్టిన సన్నివేశంతో పుష్ప2 సినిమా ద్వారా రక్త సంబంధం విలువ గురించి సుకుమార్ సమాజానికి చాల అర్థవంతమైన సూచనలు చేశారని సత్యానారాయణ అన్నారు.

ehatv

ehatv

Next Story