PawanKalyan Balakrishna : రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ
జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan kalyan) గురువారం మధ్యాహ్నం టీడీపీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నాయుడుతో భేటీ కానున్నారు. ఇందుకోసం కొద్దిసేపటి క్రితం ఆయన రాజమండ్రి విమానాశ్రయానికి(Rajahmundry Airport) చేరుకున్నారు. పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు.

PawanKalyan Balakrishna
జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan kalyan) గురువారం మధ్యాహ్నం టీడీపీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నాయుడుతో భేటీ కానున్నారు. ఇందుకోసం కొద్దిసేపటి క్రితం ఆయన రాజమండ్రి విమానాశ్రయానికి(Rajahmundry Airport) చేరుకున్నారు. పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్(Kandula Durgesh), పిఏసీ సభ్యుడు ముత్తా శశిధర్(Mutta Shasidhar) తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుంటే.. పవన్ కళ్యాణ్‌తో పాటు చంద్రబాబును లోకేష్(Lokesh), బాలకృష్ణ(Balakrishna), నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) కూడా కలవనున్నారు. ఈ నేపధ్యంలోనే బాలకృష్ణ.. ఉదయమే మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సెంట్రల్ జైలులో(Central Jail) చంద్రబాబుతో వీరు ములాఖత్ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితులపై కలిసి పోరాటం చేసే దిశగా అగ్రనేతలు ఆలోచన చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ములాఖత్ తర్వాత రాజకీయ ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతుంది.
