CM Jagan Flexis : రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం.. విశాఖలో ఫ్లెక్సీల కలకలం..!
మే 3న సీఎం వైఎస్ జగన్ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి బుధవారం సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టునున్నారు. అనంతరం విశాఖపట్నం మధురవాడ చేరుకుని వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్ధాపన చేయనున్నారు.

CM Jagan Flexis

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జన జాగరణ సమితి ఈ ప్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం-సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలలో పేర్కొంది. విశాఖపట్నం ను పాలనా రాజధాని చేస్తామంటూ జగన్ పదే పదే చెబుతున్నారు. సెప్టెంబర్ నుంచి పాలన విశాఖపట్నం నుంచే అని ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలోనే ప్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్రసంచలనమైంది. సీఎం జగన్.. రేపు విశాక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడి దంపతులను ఆశీర్వదించేందుకు ఆయన ఇంటికి వెళ్లనున్నారు. ఆ మార్గంలో ప్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేసింది జన జాగరణ సమితి.