AP DGP: ఎంతటి వారైనా ఉపేక్షించం: ఏపీ డీజీపీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ సమయంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ సమయంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు, రేంజ్ డీఐజీ లకు, ఐజీలను ఆదేశించారు. చట్టం అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జమ్మలమడుగు, తాడిపత్రి, పల్నాడు, తిరుపతి జిల్లాలో జరిగిన దాడుల గురించి డీజీపీ ఆరా తీశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పుడికే అదనపు భద్రతా బలగాలను పంపించినట్టు డీజీపీ తెలిపారు. ఆ ప్రాంతాలలో 144 సెక్షన్ విధించి రాజకీయ పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారి భద్రతలను కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు.
పల్నాడు జిల్లా మాచర్లలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ ను అమలు చేస్తూ ఉన్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేశారు. నిడిజువ్విలో వైసీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డిని, దేవగుడిలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని, కడపలో టీడీపీ అభ్యర్థి భూపేశ్‌రెడ్డిని గృహనిర్భంధం చేశారు.