Jada Sravan Kumar : తిరుమల పవిత్రతను అపవిత్రం చేస్తున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను అపవిత్రం చేసే విధంగా జగన్ నిర్ణయాలు ఉన్నాయని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆరోపించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupathi Devasthanam) పవిత్రతను అపవిత్రం చేసే విధంగా జగన్ నిర్ణయాలు ఉన్నాయని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్(Jai Bheem Bharat Party President Jada Sravan Kumar) ఆరోపించారు. అత్యంత నేరచరిత్ర ఉన్న వ్యక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్లుగా నియమించటం చట్ట విరుద్ధమన్నారు. ఎండోమెంట్ చట్టాలలో స్పష్టంగా నేర చరిత్ర లేని వ్యక్తులను నియమించాలి అని ఉన్నప్పటికీ కోట్లాది రూపాయల ముడుపులు తీసుకొని తిరుమల పవిత్రతను అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్(BR Ambedhkar) రాజ్యాంగం లో ప్రసాదించిన హక్కులలో మత విశ్వాసాలు అత్యంత ప్రాముఖ్యమైనవి.. వాటికి ఏ విధంగా హాని కలిగినా జై భీమ్ భారత్ పార్టీ(Jai Bheem Bharat Party) చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తిరుమల తిరుపతి పవిత్రతను అపహాస్యం చేస్తూ ఎన్నిక కాబడ్డ నేర చరుతలైన వారిపై హైకోర్టు(Highcourt)లో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయటానికి పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అవినీతి చరిత్ర ఉన్న ఏ ఒక్కరూ తిరుమల తిరుపతి దేవస్థానం(Tirupathi Temple)లో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు.