Jada Sravan Kumar : నేడు డీజీపీని కలవనున్న జై భీమ్ భారత్ పార్టీ అధినేత
జై భీమ్ భారత్ పార్టీ అధినేత శ్రవణ్ కుమార్ నేడు డీఐజీ(ఇంటిలిజెన్స్), డీజీపీని కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుండే తన ప్రాణాలకు ముప్పు వుందని భద్రత కల్పించాలని శ్రవణ్ కుమార్ కోరనున్నారు.
జై భీమ్ భారత్ పార్టీ(Jai Bheem Bharat Party) అధినేత శ్రవణ్ కుమార్(Sravan Kumar) నేడు డీఐజీ(ఇంటిలిజెన్స్), డీజీపీని కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుండే తన ప్రాణాలకు ముప్పు వుందని భద్రత కల్పించాలని శ్రవణ్ కుమార్ కోరనున్నారు. రాష్ట్రంలో నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా తన ప్రాణాలకు ముప్పు వుందని శ్రవణ్ కుమార్ వ్రాతపూర్వక అభ్యర్థనను సమర్పించనున్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్యా.. రాష్ట్ర ప్రభుత్వమే తనకు రక్షణ కల్పించాలని.. తనకు, తన కుటుంబానికి ఎటువంటి ప్రాణహాని జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే భాధ్యత వహించాలని శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Ambedkar) రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా.. ఎవరికి అన్యాయం జరిగినా పోరాడుతానని దానికి ప్రభుత్వ పెద్దలే ప్రాణాలు తీయడానికి ప్రణాళిక రచన చేస్తారా?? అంటూ శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.
తనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వ పెద్దల నుండే ప్రాణహాని ఉందని శ్రవణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. జై భీమ్ భారత్ పార్టీ అధినేత శ్రవణ్ కుమార్ భద్రతపై కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత రక్షణపై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కోరుతున్నారు.