అన్ని పార్టీలు పొత్తు రాజ‌కీయాలు చేస్తున్న త‌రుణంలో, తాము ప్ర‌జ‌ల‌తో, ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల చేత ప్ర‌జా మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న చేశామ‌ని జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పారు.

అన్ని పార్టీలు పొత్తు రాజ‌కీయాలు చేస్తున్న త‌రుణంలో, తాము ప్ర‌జ‌ల‌తో, ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల చేత ప్ర‌జా మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న చేశామ‌ని జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు(Jai Bharat National Party President) జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ(JD Lakshminarayana) చెప్పారు. ద‌గాప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తికి అత్యుత్త‌మ ప్ర‌ణాళిక‌లు రూపొందించి, వాటిని సామాన్య ప్ర‌జ‌లతోనే ఆవిష్క‌రించామ‌న్నారు. విజ‌య‌వాడ‌(Vjayawada)లోని ఎగ్జిక్యూటివ్ క్ల‌బ్ లో గురువారం జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ ప్ర‌జా మేనిఫెస్టో(Manifesto) ని విడుదల చేసింది. సామాన్య గృహిణి, నిరుద్యోగ యువ‌త‌, విక‌లాంగుల చేత జైభార‌త్ మ్యానిఫెస్టోని మీడియా స‌మ‌క్షంలో విడుద‌ల చేయించారు. పార్టీ అధ్య‌క్షుడు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, గౌర‌వ అధ్య‌క్షుడు చిన్న‌య దొర‌, ఉపాధ్య‌క్షుడు లంక క‌రుణాక‌ర్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోతిన వెంక‌ట రామారావు, మ‌హిళా వార‌ధి అధ్య‌క్షురాలు పి. అనంత‌ల‌క్ష్మి లాంఛ‌నంగా మేనిఫెస్టోను మీడియాకు ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం పార్టీ అధినేత జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ మేనిఫెస్టోలోని ప్ర‌ధాన అంశాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు.

అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన త‌రుణంలో జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ మేనిఫెస్టోలో దీనిని ప్ర‌ధానాంశంగా చేర్చారు. అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ త‌మ ల‌క్ష్య‌మ‌ని పార్టీ అధ్య‌క్షుడు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పారు. తాము ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మారుస్తామ‌ని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్ హక్కు అని, విభజన హామీల సాధనే త‌మ‌ ధ్యేయం అని వివ‌రించారు. నిరుద్యోగ యువ‌కు ఏటా జాబ్ నోటిఫికేషన్లు జారీ చేస్తామ‌ని, జనవరి 26- గ్రూప్-1; ఆగస్టు 15- గ్రూప్- 2+ సెప్టెంబర్ 5- డిఎస్సీ; అక్టోబర్ 21 - ఎస్సై/కానిస్టేబుల్ షెడ్యూల్ చేస్తామ‌న్నారు. ప్రతి గ్రామ పంచాయితీకి సంవత్సరానికి 1 కోటి గ్రాంట్ ఇస్తామ‌ని, దీనిపై గ్రామ ప్ర‌జా ఆడిట్ ఉంటుంద‌న్నారు.

ఏడాదికి రూ.10,000 రైతుకు, రూ.5,000 కూలీ ఖ‌ర్చుల‌కు..

స్వ‌యంగా వ్య‌వ‌సాయం చేస్తున్న త‌న‌కు రైత‌న్న క‌ష్టాలు తెలుస‌ని, అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రైత‌న్న‌కు ఏడాదికి ప‌ది వేల రూపాయ‌లు చేయూత అందిస్తామ‌ని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పారు. స్వామినాథన్ కమిటీ కనీస మద్దతు ధరలకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేస్తామ‌ని, రైతుకు వ్యవసాయకూలీల ఖర్చుకు సంవత్సరానికి 5,000 రూపాయ‌లు అందిస్తామ‌న్నారు. ఎఫ్.పి.ఓ.ల ద్వారా తక్కువ ధరలకు ధాన్యం, కూరగాయల అందుబాటులోకి తెస్తామ‌న్నారు.

జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ మేనిఫెస్టోలో హైలైట్స్

• ప్రతి కుటుంబానికి ఉపాధి; ప్రతి పంచాయితీకి 10 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు; ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ; కొత్తగా పట్టణ ఉపాధి హామీ పధకం అమలు
• ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్లు జనవరి 26- గ్రూప్-1; ఆగస్టు 15- గ్రూప్- 2+ సెప్టెంబర్ 5- డిఎస్సీ; అక్టోబర్ 31 - ఎస్సై/కానిస్టేబుల్
• నాణ్యమైన రోడ్ల నిర్మాణం; రోడ్డు భద్రతా చట్టం అమలు; కొత్త విమానాశ్రయాల ఏర్పాటు.
• మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం “వారు వద్దంటే వద్దు” పర్మిట్ విధానం అమలు.
• ప్రతి గ్రామ పంచాయితీకి సంవత్సరానికి 1 కోటి గ్రాంట్.
• ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధికి 100కోట్ల కేటాయింపు
• ప్రతి ఒక్కరికీ 10లక్షల జీవిత భీమా.
• నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి, జిల్లాకి ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రులు; ప్రతి మండలంలో ప్రభుత్వ మెడికల్ స్టోర్.
• ప్రతి ఇంటికి సబ్సిడీపై సోలార్ విద్యుత్; రైతు పారిశ్రామికవేత్తగా మారటానికి భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చేయూత.
• ప్రతి ఇంటికి సబ్సిడీపై సోలార్ విద్యుత్; రైతు పారిశ్రామికవేత్తగా మారటానికి భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చేయూత.
• సొంత ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, కంకర నిర్మాణ స్థలం వద్దకే సరఫరా.
• ఉద్యోగులకు ఆటోమేటిక్ ప్రమోషన్ విధానం, ఛాయిస్ పోస్టింగ్ ; అంగన్వాడీలు, ఆశ వర్కర్స్, పారిశుధ్య కార్మికులకు జీతాల పెంపు, గ్రాట్యుటీ, విశేష వేతన సౌకర్యం.
• ప్రతి నియోజకవర్గానికి అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్; ప్రతి జిల్లాకి ఒలింపిక్ స్థాయి ట్రైనింగ్ సెంటర్; 6వ తరగతి నుండి సైనిక శిక్షణ; కాలేజీలలో NSS లో భాగస్వామ్యం.
• ధార్మిక కట్టడాల పునరుద్ధరణ, స్థలాల రక్షణ; లలిత, జానపద కళల ఆదరణ, జిల్లాకొక సాంస్కృతిక కేంద్రం; ప్రపంచబ్రాండ్ గా మన చేతి వృత్తుల తయారీలు; తెలుగు భాషకు ప్రాధాన్యత.

• పట్టణానికి 50 ఎకరాల డంపింగ్ యార్డు, వ్యర్థాల నుంచి సంపద సృష్టి; మురుగునీటి శుద్ధి ప్లాంట్.
• చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం రూ.1,000 కోట్లతో యూత్ ఫైనాన్షియల్ కార్పొరేషన్; స్వయం ఉపాధి కల్పన, స్టార్టప్ లను ప్రోత్సహించడం.
• డ్వాక్రా సంఘాల కార్పొరేషన్, నెలవారీ మేళాలు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాడానికి ప్రత్యేక రాయితీలు.
• విద్యార్ధులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణీలకు RTC బస్ లో ఉచిత ప్రయాణం.
• నదుల అనుసంధానం; వాటర్ గ్రిడ్; తీరప్రాంత గ్రామాలకు డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు.
• భూకబ్జాదారులపై ఉక్కుపాదం
• IT కంపెనీలకు రాయితిలతో ఆఫీస్ స్పేస్(ప్లగ్ అండ్ ప్లే)
• సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికి ఆరోగ్య భీమా ఏర్పాటు.
• విద్యుత్ స్లాబ్లు మరియు రేట్ల తగ్గింపు
• ఆడబిడ్డలకు ఆస్తిగా టేకు, ఎర్ర చందనం చెట్లు; ప్రతి ఇంటికి ఉచిత వాటర్ ప్యూరిఫయర్.
• ప్రతి మండలానికి 2 కోట్లతో లైబ్రరి, నాలెడ్జ్ హబ్; స్పోకెన్ ఇంగ్షీషు, ఆప్టిట్యూడ్, కంప్యూటరు కోర్సులు.
• కర్నూలు, విశాఖపట్నం లో అసెంబ్లీ సమావేశాలు ,హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రయత్నం
• ప్రతి జిల్లాకి పోటీ పరీక్షల కేంద్రం; స్కిల్ డెవలప్మెంట్ సెంటర్.
• ఆర్టీసీ బస్టేషన్లలో బహుళంతస్తుల ప్రజాఉపయోగ సముదాయాల అభివృద్ధి
• వివాదరహిత గ్రామాలకు కోటి రూపాయల గ్రాంట్
• కొత్త పరిశ్రమలకు, మూడేళ్ళ టాక్స్ హాలిడే సదుపాయంతో జీరో కాస్ట్ ఎంట్రీ.
• దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు మరియు వడ్డీ లేని రుణాలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు రాయితీలు.
• NRIల సమస్యల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు; NRIలు, స్వచ్ఛంద సంస్థలు చేసే అభివృద్ధి పనులకు మ్యాచింగ్ గ్రాంట్స్
• ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు పారిశ్రామిక విద్యుత్ కు కనీస డిమాండ్ ఛార్జీలను తొలగించడం, సంబంధిత పరిశ్రమలకు గ్యాస్, నీటిపైపుల కనెక్షన్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించడం.

Updated On 25 Jan 2024 5:47 AM GMT
Yagnik

Yagnik

Next Story