Jaggampeta : జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబుకు ఝలక్..టీడీపీ-జనసేన పొత్తుతో లెక్కలు మారుతాయా?
జగ్గంపేట..(Jaggampeta)రాజకీయంగా బలమైన నియోజకవర్గం. జ్యోతుల నెహ్రు కుటుంబానికి కంచుకోటలాంటిది జగ్గంపేట. అలాంటి స్థానంలో రెండుసార్లు జెండా ఎగరేసింది వైసీపీ(YSRCP). గత ఎన్నికల్లోనూ సీనియర్ నేత జ్యోతుల నెహ్రుపై(Jyothula Nehru) భారీ మెజారిటీతో విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు. ఈసారి టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్ధులు పోటీ చేసే అవకాశం ఉండటంతో బలమైన బీసీ నేతలను రంగంలోకి దింపాలని భావించిన జగన్.. జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు ఝలక్ ఇచ్చారు. ఈసారి టికెట్ ఇవ్వబోమంటూ తేల్చేశారు.

2024 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్(Cm Jagan). గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తూ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉభయగోదావరి జిల్లాలోనూ పలు స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును(Jyothula chantibabu) మార్చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపే అవకాశం ఉండటంతో..బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపాలని భావించారు సీఎం జగన్. మొదటి నుంచి టికెట్ ఆశిస్తున్న సీనియర్ లీడర్, మాజీ మంత్రి తోట నర్సింహాన్ని(Tota Narasimham) జగ్గంపేటకు ఇంచార్జీగా ఖరారు చేశారు. గతంలో ఆయన టీడీపీ ఆధ్వర్యంలో ఎంపీగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి (TDP)గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. ఈ దఫా ఆయనకు న్యాయం చేయాలనుకున్న సీఎం జగన్..సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబుని పక్కనపెట్టి..తోట నర్సింహంకు అవకాశం కల్పించారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కుదరదని..ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబుకు అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తొంది. అలాగే కొత్త ఇంచార్జీలకు సహకరించాలని ఆదేశించినట్టు సమాచారం.
అయితే ఈ పరిణామాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబు జీర్ణించుకోలేకపోతున్నారట. అధిష్టానం నిర్ణయంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం సీటును నిరాకరిస్తుందని ముందే తెలియడంతో తన అనుచరవర్గంతో సమావేశం నిర్వహించారట. మరోవైపు జగ్గంపేట నుంచి తనకు సీటు ఖాయమైనట్టేనని మాజీ మంత్రి తోట నరసింహం చెప్పుకుంటున్నారట. అధిష్టానం ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోని ఎమ్మెల్యే చంటిబాబు..పార్టీ నిర్ణయానికి బద్దులై సహకరిస్తారా? లేదంటే..మంగళగిరి(Mangalgiri) ఎమ్మెల్యే ఆర్కే మాదిరిగా కీలక నిర్ణయాలను తీసుకుంటారా అనేదిదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటముల్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన కాపు(Kapu) ఓటర్ల నిర్ణయమే కీలకం. తోట నర్సింహం అదే సామాజికవర్గానికి చెందిన బలమైన నేత కావడంతో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు వైసీపీ నేతలు. మరి.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ పట్టు నిలుపుకుంటుందా? లేదంటే.. టీడీపీ-జనసేన(TDP-Janasena) పొత్తుతో లెక్కలు మారుతాయా? అసలు జగ్గంపేట ప్రజలు ఈసారి ఎవరికి జైకొట్టబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.