జగన్‌ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న 'వేణుస్వామి'

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత శ్రీ వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించి గాంధీనగర్ జిల్లా జైలు నుంచి తిరిగి తాడేపల్లి బయలుదేరుతున్న సమయంలో జగన్‌కు అభిమాని తన కూతురును తీసుకుని వైఎస్ జగన్ ను కలిసేందుకు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఉండడంతో ఆ రద్దీలో కలవలేననుకున్న చిన్నారి ఒక్కసారిగా ఏడ్చింది, దీనిని గమనించిన జగన్‌ తన కాన్వాయ్‌ ఆపి ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు, తనతో సెల్ఫీ దిగారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి హద్దుల్లేవు, తిరిగి వైయస్‌ జగన్‌ ను ముద్దాడి సంతోషంగా ఇంటికి వెళ్లిపోయింది. ఈ సన్నివేశం చూసి జగన్‌ అభిమానులు సంతోషంతో కేరింతలు కొట్టారు. కొసమెరుపు ఏంటంటే ఈ వీడియోను ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టుకోవడం విశేషం. చిన్నారికి జగన్ ముద్దు పెట్టడం, సెల్ఫీ దిగడం వీడియోను స్టేటస్ పెట్టి.. ఓ ఎమోజీని వేణుస్వామి జతపర్చారు. ఆ ఎమోజీ ప్రకారం ఆయన ఈ వీడియో గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారని అర్థమవుతోంది. మరి వేణుస్వామి ఏం ఆలోచిస్తున్నారో ఆయనకే తెలియాలి.

ehatv

ehatv

Next Story