చంద్రబాబు బయటపెట్టిన జగన్ విజయాలు..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఈరోజు విజన్‌ డాక్యుమెంట్ అంటూ కొన్ని గణాంకాలను బయటపెట్టారు. ఈ గణాంకాల ద్వారా గత ప్రభుత్వ విజయాలను కూడా బయటపెట్టినట్లయింది. ఏంటి గత ప్రభుత్వ విజయాలు అంటే చంద్రబాబు బయటపెట్టినవి అంటే.. చంద్రబాబు విజన్ 20247 అంటున్నారు.. జీఎస్‌డీపీ పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు.. తలసరి ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. సోలార్‌ పవర్‌ పెద్ద ఎత్తున తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రతీ ఇంటిపై సోలార్‌ పవర్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు. చాలా సందర్భాల్లో సంస్కరణల గురించి ఆయన మాట్లాడుతుంటారు. 1990 దశకంలోనే తాను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చానని చెప్తుంటారు. రాష్ట్రానికి సంపద సృష్టించానని.. రాష్ట్రంలో చీకట్లో నుంచి వెలుగులు నింపానని.. కానీ తాను మాత్రం చీకట్లోనే ఉండిపోయానని.. రెండు సార్లు తనను ఓడించారని.. అప్పటి సంస్కరణలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలో ఆయన బేరీజు వేసి చెప్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలుత ఐదేళ్లు చంద్రబాబు పాలించారు, ఆ తర్వాత ఐదేళ్లు వైఎస్ జగన్ పాలించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పరిపాలిస్తున్నారు. తొలుత ఐదేళ్లు, గత ఐదేళ్లు లెక్కలు చూస్తే.. ఏ రంగంలో రాష్ట్రం అభివృద్ధి జరిగిందో కేంద్రం ఇచ్చిన లెక్కలపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' లోతైన విశ్లేషణ ఈ వీడియోలో..!

Updated On 17 Jan 2025 6:14 AM GMT
ehatv

ehatv

Next Story