CM Jagan : నేడు రెండు జిల్లాల్లో వివాహ వేడుకలకు హాజరుకానున్న జగన్
నేడు సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.

Jagan will attend wedding ceremonies in two districts today
నేడు సీఎం వైఎస్ జగన్(CM Jagan) పశ్చిమగోదావరి(West Godavari), విశాఖపట్నం(Visakhapatnam) జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా భీమవరంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత గుణ్ణం నాగబాబు(Gunnam Nagababu) కుమారుడు, విశాఖపట్నంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు(Kola Guruvulu) కుమారుడి వివాహ వేడుకలకు సీఎం హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు.
28వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగే వెఎస్‌ఆర్‌సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
