తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీతానగరం వద్ద ఉన్న వైసీపీ కార్యలయాన్ని శ‌నివారం ఉద‌యం 5.30 గంట‌ల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో కూల్చేశారు.

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీతానగరం వద్ద ఉన్న వైసీపీ కార్యలయాన్ని శ‌నివారం ఉద‌యం 5.30 గంట‌ల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో కూల్చేశారు. ఫస్ట్‌ ఫ్లోర్‌ శ్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్న నిర్మాణంపై నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని పేర్కొంటూ అధికారులు చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మించారని.. అందుకే చర్యలు తీసుకున్నామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

భ‌వ‌నాన్ని కూల్చే స‌మ‌యంలో కార్యకర్తలు, వైసీపీ నేతలు రాకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చర్యలు తీసుకున్నా త‌ర్వాత‌ భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉ‍న్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్‌డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సీఆర్‌డీఏ కమిషనర్‌ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సీఆర్‌డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికితీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది.

ఈ విష‌య‌మై వైఎస్ జ‌గ‌న్ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను.

Eha Tv

Eha Tv

Next Story