2019లో ఒక్క ఛాన్స్ అంటే జగన్ ను గెలిపించారు.. నియంత మాదిరిగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్‌ రాష్ట్రాన్ని అప్పుల్లోకి తోసేశారని అన్నారు. 45 ఏళ్లు రాష్ట్రానికి చంద్రబాబు సేవ చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. వేలమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించారు. పరిశ్రమలు తీసుకొచ్చి, ఉద్యోగాలు కల్పించినందుకు చంద్రబాబును […]

2019లో ఒక్క ఛాన్స్ అంటే జగన్ ను గెలిపించారు.. నియంత మాదిరిగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్‌ రాష్ట్రాన్ని అప్పుల్లోకి తోసేశారని అన్నారు. 45 ఏళ్లు రాష్ట్రానికి చంద్రబాబు సేవ చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. వేలమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించారు. పరిశ్రమలు తీసుకొచ్చి, ఉద్యోగాలు కల్పించినందుకు చంద్రబాబును జైలుకు పంపించారా? అని ప్ర‌శ్నించారు. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేసిన చంద్రబాబును అక్రమంగా బంధించారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినందుకు.. ఇతర రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మన రాజధాని ఉండాలని అహర్నిశలు కష్టపడినందుకు.. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరినందుకు చంద్ర‌బాబును బంధించార‌ని విరుచుకుప‌డ్డారు.

జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయడం చంద్రబాబు చేసిన నేరమా? సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారని ప్రశ్నించడం చంద్రబాబు తప్పా? ఇసుక దోపిడీ, కల్తీ మద్యంపై మాట్లాడడం చంద్రబాబు చేసిన నేరమా? కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు తగ్గించాలని అడగడమే చంద్రబాబు తప్పా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అహర్నిశలు ప్రజల గురించే చంద్రబాబు ఆలోచించారని.. కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా పట్టించుకోలేద‌న్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల బిడ్డల గురించి అహర్నిశలు కష్టపడిన ప్రజా నాయకుడు చంద్రబాబు.. పేదవాళ్లు శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు రావాలని చంద్రబాబు కష్టపడ్డారని అన్నారు.

సైకో జగన్ మొదటి నిర్ణయం.. ప్రజల కోసం కట్టిన ప్రజావేదిక కూల్చడం.. దళితులు, బీసీలు, మైనారిటీలపై అక్రమ కేసులు పెట్టించ‌డం.. అంతేకాదు అనేకమంది టీడీపీ నాయకులపై వేల కేసులు పెట్టించారని ఆరోపించారు.

ఏనాడైనా మా అమ్మ బయటకొచ్చారా? చివరకు మా తల్లిపైనా కేసులు పెడతామని బెదిరించే పరిస్థితి నెలకొంద‌ని అన్నారు. ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాలకు మా అమ్మ రాలేదు. అసెంబ్లీ సాక్షిగా ఈ సైకో జగన్, ఆయన సైన్యం అవమానించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబుకు పంపించే భోజనంలో విషం కలుపుతారని మాట్లాడతారా? ఏ తప్పు చేయని చంద్రబాబును జైలుకు పంపారన్నారు.

నవంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరిస్తామ‌న్నారు. రూ.5 పేటిఎం బ్యాచ్ తో టీడీపీ, జనసేన జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యక్తిగతంగా కాదు.. రాజకీయంగా పోరాడదామని చంద్రబాబు చెప్పారు. ఆయ‌న‌ పిలుపుతోనే సంయమనం పాటిస్తున్నామ‌న్నారు.

బాత్ టబ్ కోసం రూ. 50 లక్షలు.. టాయిలెట్ కోసం రూ. 10 లక్షలు ఖర్చు పెట్టే జగన్ పేదవాడట.. అని ఎద్దేవా చేశారు. వచ్చే వారం నుండి ‘నిజం గెలవాలి’ పేరుతో అమ్మ భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారని వెల్ల‌డించారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదు. చంద్రబాబును అరెస్టు చేస్తే టీడీపీ నేతలు భయపడుతారనుకున్నారు.. టీడీపీ నేతలకు ఎలాంటి భయం లేదన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే టీడీపీ-జనసేన జేఏసీ ఏర్పాటు చేశాం. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన కలిసి పోరాడతాయన్నారు. వ్యక్తిగతంగా వెళ్లం.. రాజకీయంగా పోరాడతామ‌న్నారు.

రాష్ట్రంలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని అన్నారు. 43 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచారు. స్కిల్ కేసులో ఉన్నవారందరికీ బెయిల్ వచ్చిందని.. చంద్రబాబుకు బెయిల్ రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది మనమే.. 175కు 160 స్థానాలు గెలవడం ఖాయం.. సైకో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడిద్దాం అని పిలుపునిచ్చారు.

Updated On 21 Oct 2023 4:23 AM GMT
bodapati ashok

bodapati ashok

Next Story