ఏపీ సీఐడీ(AP CID) చీఫ్ సంజయ్(Sanjay), అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) పై జై భీమ్ భారత్(Jai Bheem Bharat) పార్టీ అధినేత‌, హైకోర్టు(High Court) న్యాయవాది జడ శ్రావణ్ కుమార్(Jada Sravan Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఐడీ(AP CID) చీఫ్ సంజయ్(Sanjay), అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) పై జై భీమ్ భారత్(Jai Bheem Bharat) పార్టీ అధినేత‌, హైకోర్టు(High Court) న్యాయవాది జడ శ్రావణ్ కుమార్(Jada Sravan Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు(Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ కేసులో(skill Development case) సిఐడి చీఫ్, ఏఏజి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కేసు విచారణలో ఉండగా.. వివరాలు బహిర్గతం చేయడం చట్టవిరుద్ధం అన్నారు. కేసు వివరాలు కోర్టు మ‌రియు విచారణ అధికారి మధ్య చాలా గోప్యంగా ఉండాలన్నారు.

సెక్షన్ 172 (3) క్రిమినల్ ప్రొసీసర్ కోడ్ ప్రకారం.. న్యాయస్థానం మాత్రమే పార్ట్ 1 సిడి వివరాలు కోరే హక్కు ఉందన్నారు. సుప్రీం కోర్టు ప్రకారం.. ఇన్వేష్టిగేషన్ వివరాలు నిందితుడికి కూడా కోరే హక్కులేదన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం.. విచారణలో జరిగే వివరాలు బహిర్గతం చేయడం వల్ల నిందితుడికి తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. విచారణలోని పలు సున్నితమైన అంశాలు ఏ హక్కుతో సీబీసీఐడి చీఫ్, ఏఏజి స్క్రీన్ ప్రాజెక్ట్ తో వెల్లడిస్తున్నారని ప్ర‌శ్నించారు. విచారణలోని సున్నితమైన అంశాలు బయటికి బహిర్గతం చేయడంపై ఏసీబీ కోర్టు సుమోటోగా కేసు నమోదు చేసేలా హైకోర్టును ఆదేశించాల‌న్నారు.

సిఐడి చీఫ్, ఏఏజి తత్తరపాటు చూస్తుంటే.. రాజకీయ కక్షలతో కేసు పెట్టినట్లుగా స్పష్టంగా కనబడుతోందన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునే అంశాలలో భాగంగా కేసు వివరాలు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసు వివరాలు వెల్లడిస్తే సాక్షులు, నిందితుడిపై ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఛార్జ్ షీట్ వేసే వరకూ కేసు వివరాలు గోప్యంగా ఉంచాలని పేర్కొన్నారు. చంద్రబాబు కేసు వివరాలు బహిర్గతం చేసినందుకు సీఐడీ చీఫ్, ఏఏజి కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని పౌరుడిగా కోరుతున్నానని జడ శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Updated On 14 Sep 2023 7:46 AM GMT
Ehatv

Ehatv

Next Story