ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఎన్నికల సందడి మొదలయ్యింది. రాజకీయ పార్టీలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని నిలబెట్టాలో.. సిట్టింగ్‌లను ఎక్కడ భర్తి చేయాలో విశ్లేషించుకుంటున్నాయి. సామాజికవర్గాల లెక్కలు తీస్తున్నాయి. తమకు పట్టున్న నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఎన్నికల సందడి మొదలయ్యింది. రాజకీయ పార్టీలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని నిలబెట్టాలో.. సిట్టింగ్‌లను ఎక్కడ భర్తి చేయాలో విశ్లేషించుకుంటున్నాయి. సామాజికవర్గాల లెక్కలు తీస్తున్నాయి. తమకు పట్టున్న నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారు. అవసరమనుకుంటూ పార్టీలు కూడా మారుతున్నారు. పార్టీలో ఈసారి టికెట్ దొరకడం కష్టమనే సంకేతాలు వచ్చిన వారు కూడా పక్క పార్టీలకు వెలుతున్నారు. ఇదిలా ఉంటే జై భీమ్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌(Jada Sravan Kumar) అసెంబ్లీ ఎన్నికల్లో(AP Asembly Elections 2024) సత్తా చాటడానికి ఉత్సహపడుతున్నారు. ఓ పక్క అధికారపక్షాన్ని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీని కూడా దునుమాడుతున్నారు జడ శ్రవణ్‌కుమార్‌(Jada Sravan Kumar). అధికారంలో ఉన్న అయిదేళ్లు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్నికల వేళ చంద్రబాబు(Chandrababu) చేస్తున్న హామీలపై శ్రవణ్‌ మండిపడ్డారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు రాష్ట్రానికి ఏం చేశారో ముందు చెప్పి తర్వాత ఉచిత హామీల ఊసు ఎత్తితే బాగుంటుందన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌ను పారిపాలించింది మీరే కదా, అప్పుడు రైతులకు ఏం చేశారు? విద్యార్థులకు ఏం చేశారు? కార్మికులకు ఏం చేశారు? మహిళలకు ఏం చేశారు? రాష్ట్రానికి మీరు చేసిన అప్పు ఎంత? ఇన్‌కమ్‌ను ఎలా జనరేట్‌ చేశారు? ఇవన్నీ చెప్పకుండా సొల్లు కబుర్లు చెప్పడమేమిటని శ్రవణ్‌ నిలదీశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ -జనసేన ప్రభుత్వం ఏర్పడటం కల్ల అని శ్రవణ్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో తాను మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, లోకేశ్‌ను ఓడించి తీరుతానని శపథం చేశారు. మంగళగిరితో పాటు తాను తాడికొండ నియోజకవర్గం నుంచి కూడా బరిలో దిగుతానని చెప్పారు. మంగళగిరిలో తాను పోటీ చేసేది ఖాయమని, లోకేశ్‌ ఓడిపోవడం జరిగి తీరుతుందని అన్నారు.

Updated On 9 Jan 2024 2:37 AM GMT
Ehatv

Ehatv

Next Story