TTD Chairman : టీటీడీ ఛైర్మన్ పదవి రేసులో చాగంటి, గరికపాటి
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి(Venkateswara swamy) వెలిసిన తిరుమల(tirumala) క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి(Venkateswara swamy) వెలిసిన తిరుమల(tirumala) క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కొండలలో నెలకొన్న ఆ కోనేటి రాయుడిని దర్శించుకుని పులకించిపోతారు. అలాంటి తిరుమల క్షేత్రం కొన్నాళ్లుగా అపవిత్రం అయ్యిందని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఏలుతున్న కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. తిరుమల పవిత్రతే తమ ధ్యేయమని చెప్పుకుంటున్నది. టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యుల నియామకంపై అందుకే మీనమేషాలు లెక్కపెడుతున్నది. ఛైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నది. ఇప్పటికే లిస్టులో చాలా మంది పేర్లు ఉన్నాయి. టీవీ5 చానెల్ అధినేత బీఆర్ నాయుడుకు(BR naidu) ఆ పదవి ఇస్తారని కొందరు, అబ్బే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణకు(NV Ramana) ఇస్తారని మరికొందరు అంటున్నారు. అసలు రాజకీయ వాసనలు లేని వ్యక్తులకు, దైవం పట్ల భయం భక్తి ఉన్న వారికి ఆ పదవి ఇస్తే బాగుంటుందన్నది చాలా మంది కోరిక. జై భీమ్ పార్టీ(Jai bheen party) అధినేత జడ శ్రవణ్ కూడా ఇదే ఆశిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవిని రాజకీయ మకిలి అంటినవారికి కాకుండా స్వామివారి సేవ కోసం తపించిపోయే వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ ప్రవచనకారులు చాగంటి కోటేశ్వరరావుకో, గరికపాటి నరసింహరావుకో ఆ పదవి ఇస్తే తిరుమల క్షేత్రం చక్కగా ఉంటుందని, భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు రావని, ఇప్పడు వచ్చిన లడ్డూ వివాదంలాంటివి భవిష్యత్తులో కనిపించవని జడ శ్రవణ్ అంటున్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సలహా వింటారా? ఆల్‌రెడీ ఆయన టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలన్నది ఫిక్స్ అయ్యి ఉంటారు.