Jagan-YS sharmila Compramise : చెల్లితో జగన్ కాంప్రమైజ్..! ఆ పత్రిక రాసింది నిజమేనా..!
ఏపీ కాంగ్రెస్(AP congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో(YS Sharmila) జగన్(YS Jagan) రాజీ చేసుకున్నారంటూ(Political compramise) ఓ వార్తను ఓ పత్రిక ప్రచురించింది.
ఏపీ కాంగ్రెస్(AP congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో(YS Sharmila) జగన్(YS Jagan) రాజీ చేసుకున్నారంటూ(Political compramise) ఓ వార్తను ఓ పత్రిక ప్రచురించింది. షర్మిలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు రాసే ఆ పత్రిక… ఇవాళ మరో సంచలనాన్ని బయట పెట్టడం గమనార్హం. బెంగళూరు వేదికగా షర్మిలతో జగన్ రాజీ చేసుకున్నారని దాని సారాంశం. కాంగ్రెస్‌తో దోస్తీ కోసం జగన్ షర్మిలకు దగ్గర కావడానికి రాజీ చేసుకున్నారని తెలిపింది. ఎట్టకేలకు ఆస్తులు పంచుకునేందుకు దాదాపు ఇరువురు అంగీకరించారని.. ఈ అంశం ఇప్పటికే ఓ కొల్లికి వచ్చిందని వార్తలను ఆ పత్రిక ప్రచురించింది.
వైసీపీ ఓటమిలో షర్మిల, వైఎస్ సునీత పాత్ర కూడా కీలకంగా మారిందని.. వారిద్దరూ వైసీపీకి వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో సక్సెస్ అయ్యారనేది విశ్లేషకుల అభిప్రాయం. కుటుంబలో తీవ్ర స్థాయిలో విభేదాలు రావడంతో కూడా వైసీపీకి కొత్త కష్టాలు తెచ్చిపెట్టిందని.. అందుకే వైసీపీ అధినేత ముందుగా తమ కుటుంబ సమస్యలను చక్కబెట్టుకోవాలని చూస్తున్నారట. తన కుటుంబంలో ఉన్న సమస్యను తొలుత అధిగమించి.. ఇక ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటానికి రెడీ అయ్యారు.
రాజకీయంలో, కుటుంబ పరంగా జగన్ - షర్మిలతో దగ్గరగా ఉండే ఇద్దరు పెద్దలు ఈ రాజీ ప్రతిపాదనల తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా కొద్ది రోజులుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. బెంగళూరులో ఇప్పటికే అన్నా - చెల్లి మధ్య చర్చలు పలు విడతలుగా జరిగాయి. ముందుగా ఇద్దరి మధ్య ఆర్దిక పరమైన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చర్చల సమయంలో షర్మిల కోరిన విధంగా ఆస్తిలో వాటాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఆ పత్రిక రాసిన వార్తలో నిజమెంంతుందో తెలియదని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే కొందరు మాత్రం షర్మిలకు సంబంధించిన కీలక అప్‌డేట్లన్నీ ఆ పత్రిక ముందుగానే రాయడం.. అందులో వచ్చిన కొన్ని వార్తలు నిజం కావడంతో.. ముఖ్యంగా షర్మిలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాసుకొచ్చే పత్రిక కావడంతో ఇందులో కొంత వాస్తవం కూడా ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.