Kapu Leaders Support Janasena : జనసేనకు కాపుల మద్దతు ఉందా.. పవన్ను గెలిపిస్తారా..?
ఏపీలో అగ్ర కులాలు ఎన్నో ఉన్నాయి.. కానీ ఇప్పటి దాకా రెడ్డి, కమ్మ, ఈ రెండు కులాలే రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయి. అగ్ర కులాల వారీగా చూస్తే.. ఓబీసీలే 50% పైగా ఉన్నారు.. వారిలో కాపులు అధికం..వీరు దాదాపు 27 % కానీ ఇప్పటివరకు వీరు అధికారం సాధించలేకపోయారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నా, ముఖ్యంగా చెప్పుకొచ్చేది మాత్రం నాయకత్వలోపం. కాపు సామాజికవర్గం ఎంతో బలంగా ఉన్నా ముందుండి నడిపించే సరైన నాయకుడు లేడు.. వంగవీటి రంగా (Vangaveeti Mohana Ranga) తరువాత కాపులకు ఆయనలాంటి నాయకుడు మళ్లీ దొరకలేదు. ముద్రగడ పద్మనాభం, దాసరి నారాయణరావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా పేరుపొందిన వారు ఎందరో ఉన్నా.. రంగా స్థాయిలో కాపులనుంచి ఆదరణ పొందడంలో విఫలమయ్యారు.
మాకు కులం లేదు, మతం లేదు ప్రాంతం లేదు.. రాజకీయ నాయకులూ తరచూ చెప్పే మాటలు ఇవి. .కానీ ఎన్నికల సమయానికి మాత్రం కులం, మంతం, ప్రాంతం వీటి ప్రాతిపదికనే టికెట్లు ఇస్తాయి పార్టీలు.. అంతే కాదు ఓటర్లు కూడా వీళ్లు మాకులం వాళ్లే అందుకే ఓట్లు వేస్తున్నాం అంటారు.. ఇక ఏపీలో అయితే ఇది ఇంకా ఎక్కువ. దాదాపు అన్నీ పార్టీలు కులం ప్రాతిపదికనే సీట్లు కానీ, పదవులు కానీ ఇస్తారు.
ఏపీలో అగ్ర కులాలు ఎన్నో ఉన్నాయి.. కానీ ఇప్పటి దాకా రెడ్డి, కమ్మ, ఈ రెండు కులాలే రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయి. అగ్ర కులాల వారీగా చూస్తే.. ఓబీసీలే 50% పైగా ఉన్నారు.. వారిలో కాపులు అధికం..వీరు దాదాపు 27 % కానీ ఇప్పటివరకు వీరు అధికారం సాధించలేకపోయారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నా, ముఖ్యంగా చెప్పుకొచ్చేది మాత్రం నాయకత్వలోపం. కాపు సామాజికవర్గం ఎంతో బలంగా ఉన్నా ముందుండి నడిపించే సరైన నాయకుడు లేడు.. వంగవీటి రంగా (Vangaveeti Mohana Ranga) తరువాత కాపులకు ఆయనలాంటి నాయకుడు మళ్లీ దొరకలేదు. ముద్రగడ పద్మనాభం, దాసరి నారాయణరావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా పేరుపొందిన వారు ఎందరో ఉన్నా.. రంగా స్థాయిలో కాపులనుంచి ఆదరణ పొందడంలో విఫలమయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) .. సినిమాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాందిచి.. అదే తరహాలో రాజకీయాల్లో కూడా గెలవాలని ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేసారు.. అయితే ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యానికి అనుకున్నంత స్థాయిలో ఆదరణ రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 293 నియోజక వర్గాల్లో పోటీ చేసిన ప్రజారాజ్యం కేవలం 18 నియోజకవరాగాల్లో మాత్రమే గెలిచింది.. చివరకు కాపులు ఎక్కువ ఉండే విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పార్టీకి అనుకునాన్ని సీట్లు రాలేదు. దీనితో పార్టీని నడపలేకపోయిన చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్(Congress)లో విలీనం చేసారు.
ప్రజారాజ్యం (Prajarajyam) పరాభవం నుంచి పుట్టి.. ప్రజలకు మంచి చేయాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన పార్టీ జనసేన (Janasena).. విభజనాంధ్రప్రదేశ్ తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో జనసేన టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చి వారిని అధికారంలో కూర్చోబెట్టింది. ఆతరువాత కొన్ని కారణాలవల్ల బయటకి వచ్చిన పవన్ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఎవరూ ఊహించని ఓటమిని చవిచూసారు. చివరకు తాను పోటీచేసిన రెండు నియోజకవరాగాల్లో కూడా ఓడిపోయారు. ఇది పవన్ కళ్యాణ్ కు కోలుకోలేని దెబ్బ.. కానీ అయన తిరిగి నిలబడి తప్పులను సరిచేసుకుంటూ మళ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు.
ఏపీలో కాపులదే అగ్రస్థానం. కానీ కాపునేతలకు సరైన ఆదరణ లభించడం లేదు. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఓటములకు కూడా ఇదే కారణం.. నేతల మధ్య సఖ్యత లేకపోడం.. కాపు నేతలు ఇతర పార్టీలలో ఉండటం వారికి కొంత అయోమయాన్ని కలిగిస్తుంది. కాపులకు అన్నీ పార్టీలు వరాలు కురిపిస్తాయి.. టీడీపీ, వైసీపీ వీరిని ఆకర్షించేందుకు వివిధ పథకాలతో ముందుకొస్తుంటారు.. కానీ ఈ సారి కాపులు కొత్త తరహాలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.. రాబోయే ఎన్నికల్లో కాపునాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలని కాపు పెద్దలంతా భావిస్తున్నారట. దీనికి తగ్గట్టే కాపుల పార్టీ అయిన జనసేనకు మద్దతు తెలపాలని భావిస్తున్నట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాపులంతా మద్దతిస్తారని ఇన్‌సైడ్ టాక్. కానీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మాత్రం వైసీపీలో ఉన్నారు.. అయన వైసీపీ నుంచి పోటీచేస్తారని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తే కాపులు ఎవరివైపు ఉంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరి 2024 ఎన్నికల్లో కాపులు అధికారం సాధిస్తారా.. వారి ఆకాంక్ష నెరవేరుతుందా అనేది చూడాలి.