అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి దేశరాజకీయాల్లోనే ఒక సంచలనానికి తెరలేపే విధంగా విజయాలను అందుకున్నారు.. ఎన్టీఆర్ తప్పటడుగులు తరువాత పరిణామాలు.. వైస్రాయి హోటల్ వ్యవహారం, చంద్రబాబు పార్టీని చేజిక్కిచ్చుకోవటం వంటి అంశాలను ఇప్పటికీ మనం వింటూనే ఉంటాము.. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. టీడీపీకి అవసరం.. చంద్రబాబుకి ఇంకా అవసరం.

రాజకీయాలు, సినిమా వేరు.. వేరు. రెండిటిని ఎప్పుడూ కలిపి చూడలేము. ఒకటి నాటకరంగమైతే మరొకటి ప్రజా జీవితం. ఫైట్స్ చేస్తూ, డైలాగులు చెప్తూ అభిమానులను అలరించడం సినిమా వాళ్లకు కొత్తేమీ కాదు.. ఆలా అని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలముందు డైలాగులు చెప్పి బొక్కబోర్లా పడ్డ వారు చాలా మంది ఉన్నారు.. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు సినిమాలలో గెలిచి రాజకీయాల్లోకి వచ్చినవారు ఎందరో..

అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి దేశరాజకీయాల్లోనే ఒక సంచలనానికి తెరలేపే విధంగా విజయాలను అందుకున్నారు.. ఎన్టీఆర్ తప్పటడుగులు తరువాత పరిణామాలు.. వైస్రాయి హోటల్ వ్యవహారం, చంద్రబాబు పార్టీని చేజిక్కిచ్చుకోవటం వంటి అంశాలను ఇప్పటికీ మనం వింటూనే ఉంటాము.. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. టీడీపీకి అవసరం.. చంద్రబాబుకి ఇంకా అవసరం.

టీడీపీకి ప్రస్తుతం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుంది. గత ఎన్నికలల్లో ఘోర పరాభవం.. పార్టీలో నాయకత్వ లోపం.. లోకేష్‏పై వ్యతిరేకత ఇవన్నీ చంద్రబాబుని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. టీడీపీ పార్టీ వెంటిలేటర్‏పై ఉందని ఆ పార్టీ మళ్లీ కోలుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రే వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటిలేటర్‏పై ఉన్న తాత పార్టీని కాపాడటానికి మనవడు వస్తాడా..?

జూ.ఎన్టీఆర్‏కు రాజకీయాలు కొత్తేమీ కాదు.. ఆయన పలుమార్లు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు.. తండ్రి హరికృష్ణ మరణం తరువాత పార్టీకి చాలా దూరంగా ఉంటున్నారు. స్వయానా తన అక్క సుహాసిని రాజకీయాల్లో పోటీచేసినా లేఖ రాసి మద్దతు తెలిపారు కానీ.. ఎప్పుడూ ప్రచారానికి రాలేదు. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు పార్టీ నేతలకు అసంతృప్తిని తెప్పిస్తుంది.. ఒకవైపు జూ.ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించాలని ఒక వర్గం భావిస్తుంటే.. చంద్రబాబు మాత్రం జూనియర్ వస్తే లోకేష్‏కు ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన దూరం పెడుతున్నారని మరికొందరి వాదన. సరే ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం.. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఓట్లు రాలతాయా..? వారు ఎవరి పేరు చెప్తే వారు విజయం సాధిస్తారా..?

ఈ ప్రపంచంలో సినిమా వాళ్లకు ఉన్నంత క్రేజ్ ఎవ్వరికి ఉండదు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే అది ఇంకా దారుణం.. కానీ రాజకీయాల్లో మాత్రం అది కష్టం.. దానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్.. గత ఎన్నికల్లో ఆయన పార్టీ పరాభవమే చెప్తుంది సినిమావాళ్లు రాజకీయాల్లో ఎంతవరకు నెగ్గుతారు అనేది. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు సినిమా వాళ్ళు రాజకీయాల్లో దెబ్బ తిన్నవారే.. అలాంటి స్టార్ హీరో అయిన ఎన్టీఆర్‏పై టీడీపీ ఎందుకు ఆధారపడుతుంది.. ఆయన పార్టీలోకి రావాలని పదేపదే ఎందుకు స్మరిస్తుంది.

ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేశారు.. ఆ సమయంలో టీడీపీ ఓడిపోవడంతో పాటు.. జూనియర్ ప్రచారం చేసిన చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలవలేదు.. అప్పుడు ప్రచారం చేస్తే గెలవని పార్టీ ఇప్పుడు ప్రచారం చేస్తే గెలుస్తుందా.. అది సాధ్యమేనా.. సినిమా హీరోలు వస్తే వాళ్ళని చూడటానికి జనాలు వస్తారు కానీ ఓట్లు రావు.. జూనియర్ జపం మానేసి టీడీపీ నేతలు పార్టీ బలోపేతంపై దృష్టిపెడితే బాగుంటుంది.

Updated On 17 May 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story