ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YSR) తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్నారు. ఆయన మరణించిన తర్వాత ఆ లెగసీని ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) కొనసాగిస్తూ వచ్చారు. వైఎస్‌ఆర్‌కు అసలైన వారసుడిని తానేనని రుజువు చేసుకున్నాడు. వైఎస్‌ఆర్‌ అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాలే జగన్మోహన్‌రెడ్డికి ఓట్లు తెచ్చాయనడంలో సందేమం లేదు. వైఎస్‌ఆర్‌ పాలనను జగన్‌ తెస్తారనే ఆయనను ముఖ్యమంత్రిని చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YSR) తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్నారు. ఆయన మరణించిన తర్వాత ఆ లెగసీని ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) కొనసాగిస్తూ వచ్చారు. వైఎస్‌ఆర్‌కు అసలైన వారసుడిని తానేనని రుజువు చేసుకున్నాడు. వైఎస్‌ఆర్‌ అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాలే జగన్మోహన్‌రెడ్డికి ఓట్లు తెచ్చాయనడంలో సందేమం లేదు. వైఎస్‌ఆర్‌ పాలనను జగన్‌ తెస్తారనే ఆయనను ముఖ్యమంత్రిని చేశారు. జగన్‌ సీఎం అయ్యారంటే అది వైఎస్‌ఆర్‌ వారసుడిగానే! అందుకే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం(Government) ప్రవేశపెట్టిన పథకాలకు, నిర్మాణాలకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టారు. పాతవాటి పేర్లు మార్చి మరి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టారు. అలా కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఇంచుమించు అయిదేళ్లుకావొస్తోంది. ఈ సమయంలో వైఎస్‌ఆర్‌కు సంబంధించి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కానీ ఈ ఏడాది మునుపటి అంత ఘనంగా జరగలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు(MLAs) కూడా పెద్దగా పట్టించుకోలేదు. కారణమేమిటో తెలియదు కానీ జగన్‌ కూడా వైఎస్‌ఆర్‌ పేరు ఎక్కువగా స్మరించడం లేదు. అప్పట్లో పత్రికల్లో వచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనల్లో వైఎస్‌ఆర్‌ బొమ్మ తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడది కనిపించడం లేదు. అలాగే ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవంలో జగన్‌ కనీసం నాలుగైదు సార్లన్నా రాజశేఖర్‌రెడ్డి పేరు తలచేవారు. ఇప్పుడది కూడా లేదు!
ఇంతకు ముందు ప్రతి పథకానికి తన తండ్రి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టుకున్న జగన్‌ ఇప్పుడది మానేశారు. ఇప్పుడొస్తున్న పథకాలకు జగనన్న పేరు మాత్రమే ఉంటోంది. పట్టాల పంపిణీ నుండి పలు సంక్షేమ పథకాల వరకూ ఇప్పుడు జగన్ పేరే వినిపిస్తున్నది. బ్యానర్లలో, ఫ్లెక్సీలలో జగన్‌ పేరే కనపిస్తున్నది. బహుశా తన సొంత ఇమేజ్‌ను(Image) బిల్డప్‌ చేసుకోవాలన్న తలంపు కావచ్చు. తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీ పెట్టిన జగన్‌ చెల్లెలు వైఎస్‌ షర్మిల(YS Sharmila) రాజన్న రాజ్యం తెస్తానంటూ తండ్రి పేరును తలచుకున్నారు కానీ, జగన్ ఆ పని కూడా చేయడం లేదు. రాజన్న రాజ్యం కంటే జగనన్న రాజ్యానికే ప్రజలు కనెక్టయ్యారని ఆయన అనుకుంటున్నారు కాబోలు. ఒకవేళ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పగ్గాలు తీసుకుంటే మాత్రం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును కచ్చితంగా పలుకుతారు. పైగా వైఎస్‌ కాంగ్రెస్‌ వ్యక్తి కూడా! అప్పుడు వైఎస్‌ఆర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ ఎవరికి చెందుతుందన్న చర్చ వస్తుంది. అదే జరిగితే మాత్రం జగన్‌ మళ్లీ తండ్రి లెగసీపై ఎంతో కొంత ఆధారపడక తప్పదు.

Updated On 30 Dec 2023 5:40 AM GMT
Ehatv

Ehatv

Next Story