AP Congress : ఏపీలో కాంగ్రెస్కు ఆదరణ పెరిగిందన్నది నిజమేనా?
వై.ఎస్.రాజశేఖర్రెడ్డి(YS Rajasekhar reddy) కూతురు వై.ఎస్.షర్మిల(YS Sharmila) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్పార్టీ సారథ్య బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆ పార్టీకి ఊపు వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి కథనాలను రాయడంలో దిట్ట అయిన టీడీపీ(TDP) అనుకూల మీడియానే ఈ రాతలు రాస్తూ వస్తున్నది. షర్మిల సభలకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెబుతోంది. ఇటీవల కొన్ని సర్వేలు(Survey) ఇచ్చిన నివేదకలో కాంగ్రెస్ పెద్దగా లాభపడిందేమీ లేదని తేలింది.
వై.ఎస్.రాజశేఖర్రెడ్డి(YS Rajasekhar reddy) కూతురు వై.ఎస్.షర్మిల(YS Sharmila) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్పార్టీ సారథ్య బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆ పార్టీకి ఊపు వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి కథనాలను రాయడంలో దిట్ట అయిన టీడీపీ(TDP) అనుకూల మీడియానే ఈ రాతలు రాస్తూ వస్తున్నది. షర్మిల సభలకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెబుతోంది. ఇటీవల కొన్ని సర్వేలు(Survey) ఇచ్చిన నివేదకలో కాంగ్రెస్ పెద్దగా లాభపడిందేమీ లేదని తేలింది. అందుకే ఆ పార్టీ తరఫున పోటీ(Contest) చేయడానికి ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. గెలవమని తెలిసి కూడా డబ్బులెందుకు తగలేసుకోవడం అన్న భావనతో చాలా మంది ఉన్నారు. పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు కోరింది కదా! ఇప్పటి వరకు 175 అసెంబ్లీ(Assembly) స్థానాల కోసం వచ్చిన అప్లికేషన్లు 793 మందే! అలాగే 25 లోక్సభ(Lok Sabha) నియోజకవర్గాల నుంచి 105 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. దీంతో దరఖాస్తు గడువును ఫిబ్రవరి 29వ తేదీ వరకు పొడిగించాల్సి వచ్చింది. ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురు చొప్పున దరఖాస్తులు వేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. నిజానికి కాంగ్రెస్కు(Congress) ఆదరణ పెరిగి ఉంటే కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి పోటీ ఉండాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ఓట్ల శాతం బాగా పెరిగిందంటే దానికి తగినట్టే ఎన్నికల బరిలో దిగే అభ్యర్థల మధ్య పోటీ కూడా ఎక్కువవ్వాలి. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎంతసేపూ జగన్మోహన్రెడ్డి(Jagan Mohan Reddy)పైనే విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశంజనసేనలకు రాజకీయ ప్రయోజనాలు కలిగించడం కోసమే షర్మిల ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. అందుకే ఆమె ప్రసంగాలకు కూడా జనం నుంచి అంతగా స్పందన రావడం లేదు.