తుఫాన్‌(Typhoon) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుఫాన్‌(Typhoon) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో అయితే రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. గత అయిదు దశాబ్దాలలో ఎప్పుడూ కురవనంతగా వానలు పడ్డాయి. విజయవాడ నగరం మొత్తం జలమయమయ్యింది. కృష్ణా నది పోటెత్తుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) నివాసానికి వరద(Flood) ముప్పు పొంచి ఉంది. కృష్ణా నది కరకట్ట లోపల చంద్రబాబు నివాసం ఉండటంతో వరద నీరు ఇంట్లోకి చేరే అవకాశం ఉంది. అందుకే అధికారులు టెన్షన్‌ పడుతున్నారు. చంద్రబాబు నివాసం దగ్గర అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం తన ఇంటిని మాత్రమే వరద నీటితో ముంచాలనే కుట్రకు పాల్పడ్డారని అప్పుడు చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇంట్లో వరద నీరు వస్తే ఎవరి మీద నిందలు మోపుతారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌Congress) ప్రశ్నిస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story