తెలంగాణలో(Telangana) తెలుగుదేశంపార్టీ(TDP) ఉన్నట్టేనా? మూసేసుకుంటున్నారా? చంద్రబాబు(Chandrababu) మాటలను బట్టి చూస్తే తెలంగాణలో టీడీపీ షట్టర్‌ వేసుకున్నట్టేననిపిస్తోంది. తన శిష్యుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అధికారంలో ఉన్న తెలంగాణలో టీడీపీ ఉండకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎంతసేపూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేస్తున్నామని చెబుతున్నారే తప్ప తెలంగాణలో పార్టీకి అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనే చేయడం లేదు.

తెలంగాణలో(Telangana) తెలుగుదేశంపార్టీ(TDP) ఉన్నట్టేనా? మూసేసుకుంటున్నారా? చంద్రబాబు(Chandrababu) మాటలను బట్టి చూస్తే తెలంగాణలో టీడీపీ షట్టర్‌ వేసుకున్నట్టేననిపిస్తోంది. తన శిష్యుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అధికారంలో ఉన్న తెలంగాణలో టీడీపీ ఉండకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎంతసేపూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేస్తున్నామని చెబుతున్నారే తప్ప తెలంగాణలో పార్టీకి అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనే చేయడం లేదు. కాసాని జ్ఞానేశ్వర్‌(Kasani Gnaneshwar) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక ఇప్పటి వరకు కొత్తవారిని నియమించలేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణ చేపడటారని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ప్రాంతీయపార్టీగా ఇక్కడ గుర్తింపు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తన శిష్యుడు రేవంత్‌రెడ్డికి (ఈ మాటంటే డాష్‌ మీద తంతా అని విలేకరుల మందే రేవంత్‌ అన్నప్పటికీ వీరిద్దరిది గురుశిష్య సంబంధమే)మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా చంద్రబాబు వ్యవహరించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ చంద్రబాబు అభ్యర్థులను బరిలో దింపలేదు. ఇప్పుడు కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండాలంటూ క్యాడర్‌కు హితబోధ చేశారు చంద్రబాబు. జూన్‌ 2వ తేదీన జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో చురుకుగా పాల్గొనాలని , పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరేయాలని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వానికి మద్దతు తెలపాలని తనను కలిసిన పార్టీ వర్గాలకు హితబోధ చేశారు చంద్రబాబు. ఇదిలా ఉంటే, జూన్‌ 4వ తేదీన వెలువడే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో పార్టీ గురించి ఆలోచన చేద్దామని చంద్రబాబు చెప్పారట!

Updated On 1 Jun 2024 2:50 AM GMT
Ehatv

Ehatv

Next Story