K.Atchannaidu : ఏపీలో మళ్లీ 'డ్రిప్ వ్యవసాయం'
రైతులకు(Farmers) బిందు సేద్యం పరికరాలను పంపిణీ చేసేందుకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు(K.Atchannaidu) అధికారులను ఆదేశించారు.
రైతులకు(Farmers) బిందు సేద్యం పరికరాలను పంపిణీ చేసేందుకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు(K.Atchannaidu) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో బిందు సేద్యంపై(Drip irrigation) జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా విస్మరించిందని, పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు రూ.1,167 కోట్ల బకాయిలు చెల్లించడంలో విఫలమైందన్నారు. బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.176 కోట్లను విడుదల చేసిందని తెలిపారు.
ఈ ఏడాది మూడు లక్షల హెక్టార్లలో బిందు సేద్యం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రూ.3,450 కోట్ల అదనపు ఆదాయం పొందేలా చేయాలని అనుకుంటున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. 2015-18లో బిందు సేద్యం అమలులో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. అయితే గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్‌ను విస్మరించారని మండిపడ్డారు. ప్రస్తుతం హార్టికల్చర్‌లో 55 శాతం బిందు సేద్యం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బిందు సేద్యం 100 శాతం అమలుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.