ఏపీ రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. యోగా అనేది ఆరోగ్యవంతమైన జీవన విజ్ఞాన కళ అని అన్నారు. యోగా మనస్సుకు, శరీరానికి మధ్య సామరస్య‌త‌ను తీసుకురావడానికి, శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు.

ఏపీ రాజ్‌భవన్‌(Raj Bhavan)లో బుధవారం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 వేడుక(International Yoga Day celebrations)ల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్(S. Abdul Nazeer)పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. యోగా అనేది ఆరోగ్యవంతమైన జీవన విజ్ఞాన కళ అని అన్నారు. యోగా(Yoga) మనస్సుకు, శరీరానికి మధ్య సామరస్య‌త‌ను తీసుకురావడానికి, శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు. యోగాను క్రమం తప్పకుండా చేయడం వల్ల రోగనిరోధక శక్తిని, అంతర్గత శక్తిని పెంపొందించడం వంటి అపారమైన ప్రయోజనాలు లభిస్తాయని గవర్నర్ అన్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా యోగా చేయ‌డం వ‌ల్ల‌ అన్ని వయసుల వారు శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను పొంద‌వ‌చ్చ‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో రాజ్ భవన్ అధికారులతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఆయుష్ విభాగానికి చెందిన డా. సి.హెచ్. రామానంద్(Ramanand), ప్రవల్లిక(Pravallika) వివిధ యోగా భంగిమలను ప్రదర్శించి, ఒక్కో యోగాసనం( Yoga Postures) వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.

Updated On 20 Jun 2023 11:01 PM GMT
Yagnik

Yagnik

Next Story