దేశంలో కరోనా కేసుల వేగం మరోసారి పెరగడం మొదలైంది. పలు రాష్ట్రాల నుంచి కేసుల పెరుగుదలపై సమాచారం అందుతోంది.
దేశంలో కరోనా కేసుల(Corona Cases) వేగం మరోసారి పెరగడం మొదలైంది. పలు రాష్ట్రాల నుంచి కేసుల పెరుగుదలపై సమాచారం అందుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 774 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలతో యాక్టివ్ కేసుల(Active Cases) సంఖ్య 4187 కి చేరుకుంది. మంత్రిత్వ శాఖ ఈ ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 774 కోవిడ్ -19 కేసులు(Covid-19 Cases) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు కూడా కరోనా కారణంగా మరణించారు. ఈ రెండు కరోనా మరణాలు తమిళనాడు(Tamil Nadu), గుజరాత్(Gujarat) రాష్ట్రాలలో సంభవించాయి.
గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే మళ్లీ కేసులు పెరగడం ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. కొత్త COVID-19 వేరియంట్ JN.1 ఆవిర్భావం నుంని కేసులు పెరిగాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న డేటా JN.1 వేరియంట్ కొత్త కేసుల విపరీతమైన పెరుగుదలకు, మరణాల పెరుగుదలకు దారితీయదని అధికారిక మూలం పేర్కొంది.