తెలుగు రాష్ట్రాలకు(Telugu states) వాతావరణ శాఖ(Meterologiical department) హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వర్షాలు(Rains) పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు(Telugu states) వాతావరణ శాఖ(Meterologiical department) హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వర్షాలు(Rains) పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఏపీలోనూ(AP) పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే తమిళనాడు అంతటా వర్షాలు కురుస్తున్నాయి.

Updated On 6 Nov 2023 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story