Heavy Rains : వచ్చే అయిదు రోజులు భారీ వర్షాలు
రాబోయే అయిదు రోజులు పలు రాష్ట్రాలలో ఈదురుగాలతో(Strom Rains) కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు(Monsoon) చురుకుగా కదులుతున్నాయని తెలిపింది.
రాబోయే అయిదు రోజులు పలు రాష్ట్రాలలో ఈదురుగాలతో(Strom Rains) కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు(Monsoon) చురుకుగా కదులుతున్నాయని తెలిపింది. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలు ఇవాళ అప్రమత్తంగా ఉండటం మంచిదని సూచిస్తోంది. సోమ, మంగళవారాల్లో దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ఆంధ్ర లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం దక్షిణ భారత్‌పై షియర్ జోన్ అంటే మేఘాలు బాగా ఉన్నాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేమ బాగా ఉంది. తెలంగాణలో 71 శాతం , ఆంధ్రప్రదేశ్‌లో 56 శాతం ఉంది. తె