తెలుగు రాష్ట్రాలలో(Telugu states) ఎండలు(Heat) దంచికొడుతున్నాయి. మార్చి నెలలోనే వడగాలుల(Heat waves) తీవ్రత మొదలయింది . సూర్యుడు భగభగ మండిపోతూ దడపుట్టిస్తున్నాడు. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్‌లోని(ANdhra Pradesh) కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు(Temperatures) సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచ 43 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో(Telugu states) ఎండలు(Heat) దంచికొడుతున్నాయి. మార్చి నెలలోనే వడగాలుల(Heat waves) తీవ్రత మొదలయింది . సూర్యుడు భగభగ మండిపోతూ దడపుట్టిస్తున్నాడు. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్‌లోని(ANdhra Pradesh) కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు(Temperatures) సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచ 43 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంట్లో ఉంటేనేమో భరించలేనంత ఉక్కపోత. బయటకు వెళదామంటేనేమో మాడు పగలగొట్టేంత ఎండ. అత్యవసరం ఉంటే తప్ప జనం బయటకు రావడం లేదు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ
50 మండలాల్లో వడగాలులు, రేపు 56 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తెలంగాణలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో, పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Updated On 30 March 2024 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story