ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) మరోసారి తుఫాన్‌(Cyclone) ముప్పు పొంచి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) మరోసారి తుఫాన్‌(Cyclone) ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో(Bangladseh) శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. వాయుగుండం తీవ్రరూపం దాల్చి 17వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌లోనే తీరం దాటవచ్చని అనుకుంటున్నారు. ఇది తుఫాన్‌గా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15వ తేదీ నాటికి తీరాన్ని తాకవచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.

Eha Tv

Eha Tv

Next Story